భీమవరంలో కేఏ పాల్ హల్‌చల్..!
భీమవరం: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హల్‌చల్ చేశారు. భీమవరంలోని అతిథి హోటల్‌లో ఉన్న తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ను చూపించాలంటూ హోటల్ సిబ్బందిని కోరారు. కంప్యూటర్ పనిచేయడం లేదని చెప్పడంతో పాల్ వారితో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు హోటల్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొందరు యువకులు పాల్ రూమ్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. అభిమానులమంటూ పాల్‌పై […]
భీమవరం: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హల్‌చల్ చేశారు. భీమవరంలోని అతిథి హోటల్‌లో ఉన్న తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ను చూపించాలంటూ హోటల్ సిబ్బందిని కోరారు. కంప్యూటర్ పనిచేయడం లేదని చెప్పడంతో పాల్ వారితో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు హోటల్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొందరు యువకులు పాల్ రూమ్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. అభిమానులమంటూ పాల్‌పై దాడి చేసేందుకు యత్నించారు. దీంతో ఆయన కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు.