Jr NTR : యంగ్ టైగర్ ఆ యువ దర్శకుడికి ఓకే చెప్పాడట, ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ !
హిట్ దర్శకుడికి యంగ్ టైగర్ ఓకే చెప్పారట. హిట్ దర్శకుడు అంటే ఇటీవల సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుకోకండి. 'హిట్' సినిమా మీకు గుర్తుండే ఉంటుంది.

‘హిట్’ దర్శకుడికి యంగ్ టైగర్ ఓకే చెప్పారట. ‘హిట్’ దర్శకుడు అంటే ఇటీవల సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుకోకండి. ‘హిట్’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. లాక్‌డౌన్‌కు ముందు హీరో నాని నిర్మించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఆ సినిమా డైరెక్టర్‌తోనే ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ‘హిట్’ మూవీని తెరకెక్కించి మంచి మార్కులు అందుకున్నాడు శైలేష్ కొలను. ఈ సినిమాను తెరకెక్కించిన శైలేష్‌కు ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు స్టార్ హీరోల నుంచి పిలుపు కూడా వచ్చింది. ఈ లిస్ట్‌లోనే ఎన్టీఆర్ కోసం ఓ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను రెడీ చేసిన శైలేష్… దిల్ రాజు సహకారంతో యంగ్ టైగర్‌కు స్టోరీ కూడా వినిపించాడట. ఎన్టీఆర్ కూడా ఈ కథకు పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.
అయితే ఎన్టీఆర్ ఓకే చెప్పినా..ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ అయితే లేదు. ప్రజెంట్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు తారక్. ఆ తరువాత త్రివిక్రమ్‌తో కలిసి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అంటూ ఓ పొలిటికల్ డ్రామాకు ఓకే చెప్పారు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గానీ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ అయితే లేదు. మరి ఈ లోగా శైలేష్… ఫుల్ స్క్రిప్ట్‌తో తారక్‌ను మెప్పిస్తాడేమో చూడాలి.
Also Read :
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పున:ప్రారంభం, తాగి వాహనం నడిపితే బ్యాండ్ బాజానే
కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?
16 మంది అమ్మాయిలతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తా, కెమెరాలు ఉన్నా ఫర్వాలేదు : వర్మ మార్క్ కామెంట్స్