కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ‘మహారాష్ట్ర ఓల్డ్ మ్యాన్’ శరద్ పవార్ ? సోనియా గాంధీ వైదొలగుతారా ?

కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ఎన్నిక కావచ్చునని తెలుస్తోంది. తదుపరి యూపీఏ చైర్ పర్సన్ పదవికి ఈయన తగినవారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తన ఆరోగ్య పరిస్థితి..

కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా 'మహారాష్ట్ర ఓల్డ్ మ్యాన్' శరద్ పవార్ ? సోనియా గాంధీ వైదొలగుతారా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 10, 2020 | 9:00 PM

కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ఎన్నిక కావచ్చునని తెలుస్తోంది. తదుపరి యూపీఏ చైర్ పర్సన్ పదవికి ఈయన తగినవారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ పదవిలో కొనసాగడానికి విముఖత చూపుతున్నారని, క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా లేరని, ఈ నేపథ్యంలో పవార్ పార్టీని ముందుండి నడిపించగలరని అంటున్నారు. యూపీఏ పక్షాల్లో ఆయన పట్ల అందరికీ అభిమానం, గౌరవం ఉన్నాయని, రాష్ట్రంలో అందరికీ ఆయన ఆప్తుడని ఈ వర్గాలు పేర్కొన్నాయి. మళ్ళీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ  తిరస్కరించడంతో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాహుల్ రాజీనామా చేశాక తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా పదవి చేపట్టారు.

మహారాష్ట్రలో లోగడ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పొందినప్పటికీ శివసేన చేతులు కలపడంతో ఇక్కడ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. వచ్ఛే ఏడాది ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ను ఎన్నుకోవాల్సి ఉంది. పార్టీని లీడ్ చేయడానికి శరద్ పవార్ కి అన్ని అర్హతలూ ఉన్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రజల నాది పవార్ కు బాగా తెలుసునన్నారు. అయితే వంద ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న సీనియర్ నేతలు కూడా చాలామందే ఉన్నారు. అందరినీ పవార్ కలుపుకుని పోగలరా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న !

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో