చైనా, పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేయండి.. కేంద్ర మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంజయ్ రౌత్..
రైతుల ఆందోళనల వెనుక పాకిస్తాన్, చైనా దేశాల హస్తం ఉందంటూ కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దన్వే చేసిన వ్యాఖ్యలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు.
రైతుల ఆందోళనల వెనుక పాకిస్తాన్, చైనా దేశాల హస్తం ఉందంటూ కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దన్వే చేసిన వ్యాఖ్యలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. రైతుల ఆందోళన వెనుక చైనా, పాకిస్తాన్‌ల ప్రమేయం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. గరువారం మహారాష్ట్రంలో మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒకవేళ కేంద్రమంత్రి చెప్పిందే నిజమైతే.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ తక్షణమే పాకిస్తాన్, చైనా దేశాలపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడమే కాకుండా.. చిల్లర కామెంట్స్ చేస్తున్నారంటూ కేంద్ర మంత్రులపై సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు.
If a Union minister has information that China & Pakistan have a hand behind farmers agitation, then, the Defence Minister should immediately conduct a surgical strike on China & Pak. The President, PM, HM & Chiefs of the Armed Forces should discuss this issue seriously: S Raut https://t.co/1GagzoaTHA pic.twitter.com/ImIVdNiJVY
— ANI (@ANI) December 10, 2020