16 మంది అమ్మాయిలతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తా, కెమెరాలు ఉన్నా ఫర్వాలేదు : వర్మ మార్క్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ..సమాజానికి అర్థంకాని ఓ వ్యక్తి. ఏదైనా విషయంపై ఒకరోజు ఇచ్చిన ప్రకటనపై నిలబడి ఉండడు. మరోరోజు అదే విషయంపై విభిన్నమైన కామెంట్ చేసి..

16 మంది అమ్మాయిలతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తా, కెమెరాలు ఉన్నా ఫర్వాలేదు : వర్మ మార్క్ కామెంట్స్
Follow us

|

Updated on: Dec 10, 2020 | 6:37 PM

రామ్ గోపాల్ వర్మ..సమాజానికి అర్థంకాని ఓ వ్యక్తి. ఏదైనా విషయంపై ఒకరోజు ఇచ్చిన ప్రకటనపై నిలబడి ఉండడు. మరోరోజు అదే విషయంపై విభిన్నమైన కామెంట్ చేసి..మనసు మార్చుకున్నా అంటాడు. తాను సినిమాలు తీస్తాడు..చూస్తే చూడండి లేదంటే లేదంటాడు. “మనషుల్లో వర్మ వేరయ్యా” అనే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకోగలిగాడు. ఒకనొక టైమ్‌లో ట్రెండ్ సృష్టించిన ఈయన..ఇప్పుడు కొత్తగా ఏమైనా తీసి ఉంటాడా అని సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు తలనొప్పి తెప్పిస్తున్నాడు. ఇంత ఇంటిలిజెంట్ ఇలా ఎందుకు మారిపోయాడో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. తాజాగా బిగ్ బాస్ షోపై వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాను బిగ్ బాస్ షో ఎక్కువగా చూడనని… గతంలో సన్నీలియోన్ హిందీ బిగ్‌బాస్‌లో వచ్చినప్పుడు మాత్రమే చూశానని వ్యాఖ్యానించారు. కేవలం సన్నిలియోన్ కోసం కొన్ని ఎపిసోడ్ మాత్రమే చూడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తెలుగులో ఇప్పటివరకు చూడలేదని, వ్యాఖ్యాతగా రమ్మని పిలిచినా వెళ్లడానికి ఇంట్రస్ట్ లేదని తెలిపారు. ఇక బిగ్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చెయ్యడం వర్మకు ఇష్టమేనట. అయితే ఆయన కొన్ని షరతులు కూడా ఉన్నాయి అంటున్నారు. “బిగ్‌బాస్ ఇంటిలోకి 16 మంది అమ్మాయిలు, నన్ను మాత్రమే పంపిస్తే నేను వెళ్తాను. 16 మంది అమ్మాయిలు తప్ప మరొకరు ఉండకూడదు. 500 కెమెరాలు ఉన్నా ఫర్వాలేదు.. నైట్ విజన్ కెమెరాలున్నా లైట్ తీసుకుంటాను” అని రామ్ గోపాల్ వర్మ  తన మార్క్ వ్యాఖ్యలు చేశాడు.

Also Read :

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పున:ప్రారంభం, తాగి వాహనం నడిపితే బ్యాండ్ బాజానే

కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?

తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు..హైదరాబాద్‌లో హోమ్ డెలివరీ సేవలు ప్రారంభం