హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పున:ప్రారంభం, తాగి వాహనం నడిపితే బ్యాండ్ బాజానే

ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పట్నుంచి ఒక లెక్క. ఇప్పటిదాకా కరోనా వ్యాప్తి కారణంగా వచ్చిన విపత్కర పరిస్థితులను వాడుకున్నారు మందుబాబులు.

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పున:ప్రారంభం, తాగి వాహనం నడిపితే  బ్యాండ్ బాజానే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 10, 2020 | 6:24 PM

ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పట్నుంచి ఒక లెక్క. ఇప్పటిదాకా కరోనా వ్యాప్తి కారణంగా వచ్చిన విపత్కర పరిస్థితులను వాడుకున్నారు మందుబాబులు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పీకల దాకా తాగి..వాహనాలు డ్రైవ్ చేశారు. ఇటీవల సీటీలో రెండు, మూడు యాక్సిడెంట్స్ కూాడా డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగానే జరిగాయి. దీంతో ఫోకస్ పెంచిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైన్ తనిఖీలు షురూ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..ఫేస్ షీల్డ్‌లు ధరించి వాహనాలు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు.

తనిఖీల్లో భాగంగా బ్రీత్‌ ఎనలైజర్‌కు శానిటేషన్‌ చేసి, ఫేసు షీల్డ్‌ ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌  టెస్టులు నిర్వహిస్తున్నారు. తనిఖీలు  సందర్భంగా ఎవరికి కోవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాచకొండ ట్రాఫిక్‌ అదనపు డీసీపీ తాజుద్దీన్‌ వెల్లడించారు. తాగి నడిపితే వాహనం సీజ్ చేస్తామని..మందుబాబులు ఫైన్ కట్టడంతో పాటు కోర్టుకు హాజరు కావాల్సిందేనన్నారు.

Also Read :

కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి, కారు అద్దాలు ధ్వంసం

తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు..హైదరాబాద్‌లో హోమ్ డెలివరీ సేవలు ప్రారంభం