‘ఆనంద నిలయం.. అనంత స్వర్ణమయం’రద్దు, భక్తులు కానుకలు వెనక్కి తీసుకోవడమో, లేదా వేరే పథకాలకు మళ్లించాలని టీటీడీ వినతి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు తాపడం వేయడానికి టీటీడీ ప్రారంభించిన "ఆనంద నిలయం.. అనంత..
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు తాపడం వేయడానికి టీటీడీ ప్రారంభించిన “ఆనంద నిలయం.. అనంత స్వర్ణమయం” ప్రాజెక్టును రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 28న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో అనంత స్వర్ణమయం ప్రాజెక్టును కొనసాగించలేమని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి బంగారం, నగదు విరాళంగా ఇచ్చిన భక్తులు వెనక్కి తీసుకోవడమో లేదా వేరే పథకాల మళ్లించడమో చేయాలని ఆయన కోరారు.
2008 కాంగ్రెస్ హాయంలో ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం వేయాలని నిర్ణయించారు. రాగిరేకులకు బంగారు పూతను పూసి శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయానికి బంగారు తాపడం వేయడానికి ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పట్లో భక్తుల దగ్గర నుండి బంగారం, నగదు విరాళాలుగా కోరడంతో భారీ ఎత్తున బంగారం విరాళంగా అందింది. దాదాపు 270 దాతలు 95 కేజీల బంగారం, రూ.13కోట్ల నగదును ప్రాజెక్టు నిర్మాణానికి విరాళంగా అందించారు.