శ్రీవిష్ణు హీరోగా, తేజ మార్ని దర్శకత్వంలో కొత్త సినిమా… నిర్మించనున్న మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
శ్రీవిష్ణు హీరోగా, జోహార్ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ప్రొడక్షన్ నంబర్ 9పై ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.
MATINEE ENTERTAINMENT’s PRODUCTION NO:9 LAUNCHED WITH SREE VISHNU IN MAIN LEAD AND TEJA MARNI AS DIRECTOR శ్రీవిష్ణు హీరోగా, జోహార్ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ప్రొడక్షన్ నంబర్ 9పై ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని నిర్మాణ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. అన్వేష్ రెడ్డి, శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ కలిసి సినిమా స్క్రిప్టును దర్శక నిర్మాతలకు అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ క్లాప్ నివ్వగా, సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. స్వరూప్ ఆర్.ఎస్.జె. గౌరవ దర్శకత్వం వహించారు.
తన తొలి తెలుగు సినిమా విడుదల కాకమునుపే అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న అమృతా అయ్యర్ ఈ చిత్రంలో శ్రీవిష్ణు జోడీగా నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్.ఎమ్. పాషా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కథ, స్క్రీన్‌ప్లేలను తేజ మార్ని అందిస్తుండగా, సుధీర్ వర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు. డిసెంబర్ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం సమకూరుస్తుండగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
క్షణం, ఘాజి, గగనం లాంటి చక్కని కంటెంట్ ఉన్న కమర్షియల్ హిట్ సినిమాల్ని నిర్మించిన ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’, కింగ్ నాగార్జున్ హీరోగా ‘వైల్డ్ డాగ్’ లాంటి క్రేజీ ఫిలిమ్స్‌ను నిర్మిస్తోంది.