జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్రలేఖ్‌కు కరోనా

జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ధ్రువీకరించారు.

జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్రలేఖ్‌కు కరోనా
Follow us

|

Updated on: Aug 23, 2020 | 10:24 AM

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా రాకాసి కోరలకు చిక్కుకుంటున్న ప్రముఖుల జాబితా కూడా పెరుగుతుంది. తాజాగా జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ధ్రువీకరించారు. తనకు సన్నిహితులుగా ఉన్న వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తనను ఈ మధ్య కాలంలో కలిసిన కార్యకర్తలు, అధికారులు సురక్షితంగా ఇంటిలోనే ఉండాలని ఆయన కోరారు. శనివారం రాత్రి తనకు వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. మరోవైపు గత రెండు మూడు రోజులుగా కలిసిన అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం.

కాగా, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్, ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు శనివారం రాత్రే మంత్రి పత్రలేఖ్ ట్వీట్ చేశారు. శిబు సోరెన్, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని వారి కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ట్విటర్‌ ఖాతాలో ధ్రువీకరించారు.