అచ్చెన్నాయుడుని మంగళగిరి ఆసుపత్రికి తరలింపు

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును శనివారం రాత్రి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు

అచ్చెన్నాయుడుని మంగళగిరి ఆసుపత్రికి తరలింపు
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 10:41 AM

MLA Atchannaidu News: ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును శనివారం రాత్రి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో ఆయన ఇన్ని రోజులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.

కాగా ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో దాదాపు 150కోట్ల స్కాంలో జూన్ 12న అచ్చెన్నను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 12 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో మొత్తం 19 మందిని కేసు నమోదు కాగా.. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం పోలీసులు ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More:

సైరాలో చెర్రీ నటించాల్సింది.. కానీ వద్దన్న చిరు.. ఎందుకంటే!

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,384 కొత్త కేసులు.. 11 మరణాలు