భారత్‌లో రూ.7వేల కోట్ల పెట్టుబడులు..అమెజాన్ సీఈఓ ప్రకటన

అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. చిన్న, మధ్యతరహా బిజినెస్‌లను డిజిటలైజ్ చేసేందుకు ఇండియాలో భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. భారత్‌ మున్ముందు ఎంతో అభివృద్ది చెందుతోందన్న ఆవాభావం వ్యక్తం చేసిన ఆయన..సుమారు రూ. 7 వేల కోట్ల పెట్లుబడులు పెడుతున్నామని తెలిపారు. 21వ శతాబ్దం ఇండియాదే అంటూ ప్రశంసల వర్షం కురించారు బెజోస్. మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా అతి పెద్ద […]

భారత్‌లో రూ.7వేల కోట్ల పెట్టుబడులు..అమెజాన్ సీఈఓ ప్రకటన
Follow us

|

Updated on: Jan 15, 2020 | 8:15 PM

అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. చిన్న, మధ్యతరహా బిజినెస్‌లను డిజిటలైజ్ చేసేందుకు ఇండియాలో భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. భారత్‌ మున్ముందు ఎంతో అభివృద్ది చెందుతోందన్న ఆవాభావం వ్యక్తం చేసిన ఆయన..సుమారు రూ. 7 వేల కోట్ల పెట్లుబడులు పెడుతున్నామని తెలిపారు. 21వ శతాబ్దం ఇండియాదే అంటూ ప్రశంసల వర్షం కురించారు బెజోస్. మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని , అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తుందని కితాబిచ్చారు. 2025 వచ్చేసరికి రూ.70వేల కోట్ల విలువైన భారతీయ వస్తువులను ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు.

ఇక బెజోస్ భారత పర్యటనకు అదే స్థాయిలో నిరసనలు కూడా వ్యక్తమవుతోన్నాయి. దాదాపు 300 సిటీస్‌లో అమెజాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలపేందుకు చిన్న,సన్నకారు వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెజాన్ వస్తులవులపై భారీ డిస్కౌంట్స్‌తో తమ పొట్టకొడుతోందని వారు ఆరోపిస్తున్నారు. కాగా భారత ఆన్‌లైన్ మార్కెట్‌ను విదేశీ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు శాసిస్తున్నాయి.