థాంక్యూ సీఎం గారు.. జగన్‌ను అభినందించిన మెగా బ్రదర్..

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భూముల అమ్మకంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై చాలామంది ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కోవలోనే తాజాగా సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. ‘టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి […]

  • Updated On - 10:48 am, Wed, 27 May 20 Edited By: Pardhasaradhi Peri
థాంక్యూ సీఎం గారు.. జగన్‌ను అభినందించిన మెగా బ్రదర్..

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భూముల అమ్మకంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై చాలామంది ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కోవలోనే తాజాగా సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు.

‘టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి.థాంక్యూ యు సీఎం గారు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, నాగబాబు ఇటీవల గాంధీపై చేసిన ట్వీట్లు కూడా వివాదాస్పదమైన సంగతి విషయం విదితమే.