కొంపముంచిన దావత్… 22 మందికి కరోనా

ఓవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే హైదరాబాద్‌లోని ఓ కుటుంబం మాత్రం దాన్ని లెక్క చేయలేదు. దీంతో ఆ కుటుంబంలోని 13తో సహా, మరో 9మందికి కూడా వైరస్‌ సోకింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన పహాడీషరీఫ్‌లో జరిగిన ఓ వేడుక కరోనా వైరస్‌కు ఆహ్వానం పలికింది. ఈ పార్టీలో పాల్గొన్న 22 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. పహాడీషరీఫ్‌లోని ఓ మటన్‌ వ్యాపారి కుటుంబానికి సమ్మర్‌లో ఏటా ఒక చోట చేరి సరదాగా గడపటం అలవాటు. ఇదే […]

కొంపముంచిన దావత్... 22 మందికి కరోనా
Follow us

|

Updated on: May 27, 2020 | 12:38 PM

ఓవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే హైదరాబాద్‌లోని ఓ కుటుంబం మాత్రం దాన్ని లెక్క చేయలేదు. దీంతో ఆ కుటుంబంలోని 13తో సహా, మరో 9మందికి కూడా వైరస్‌ సోకింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన పహాడీషరీఫ్‌లో జరిగిన ఓ వేడుక కరోనా వైరస్‌కు ఆహ్వానం పలికింది. ఈ పార్టీలో పాల్గొన్న 22 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. పహాడీషరీఫ్‌లోని ఓ మటన్‌ వ్యాపారి కుటుంబానికి సమ్మర్‌లో ఏటా ఒక చోట చేరి సరదాగా గడపటం అలవాటు. ఇదే ఆ కుటుంబాన్ని కొంపముంచింది.

కరోనాను లెక్క చేయకుండా… పది రోజుల క్రితం నాలుగు కుటుంబాలకు చెందిన 28 మంది దావత్ చేసుకోవాలని నిర్ణయించారు. జియాగూడ, గౌలిపురా, బోరబండ ప్రాంతాల నుంచి ముగ్గురు చొప్పున, సంతోష్‌నగర్‌ నుంచి ఐదుగురు వెరసి మొత్తం 14 మంది పార్టీలో పాల్గొన్నారు. ఇలా మొత్తం 42 మంది ఒకేచోట చేరి రెండు రోజులపాటు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. అనంతరం వీరిలో 18 మంది మహేశ్వరం మండలం హర్షగూడలో కిరాణా దుకాణం నడుపుకునే బంధువు ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి మరోసారి చిన్న పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో బోరబండ నుంచి వేడుకకు హాజరైన ముగ్గురికి, సంతోష్‌నగర్‌ నుంచి వచ్చిన ఐదుగురిలో ఇద్దరికి నాలుగు రోజుల కిందట కరోనా సోకినట్లుగా నిర్ధారించారు.

పహాడీషరీఫ్‌లో వేడుక జరిగిన విషయం వైద్య సిబ్బందికి తెలిసింది. అందులో పాల్గొన్న పహాడీషరీఫ్‌లోని 28 మందిని ఈనెల 23 నుంచి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వీరి శాంపిల్స్‌ పరీక్షించగా 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణ జరిగింది. కిరాణా వ్యాపారి కుటుంబానికి చెందిన నలుగురికి పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వేడుకలో పాల్గొన్న మొత్తం 22 మందికి కరోనా సోకినట్లయ్యింది.

అయితే  దావత్ ఇచ్చిన వ్యాక్తికి మటన్ వ్యాపారం ఉంది. ఇతని వద్ద ఎంత మంది మటన్ కొన్నారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరితోపాటు హర్షగూడలోని కిరాణా వ్యాపారి నుంచి ఎంతమంది సరకులు కొనుగోలు చేశారన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. హర్షగూడలో కరోనా నిర్ధారణ అయిన కుటుంబం ఉండే బస్తీలో 125 ఇళ్లను గుర్తించి కంటెయిన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. రెండు ప్రాంతాల్లోనూ 40 బృందాలతో సర్వే చేస్తున్నారు.