Ammavodi Scheme: ‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండి.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..

అమ్మ ఒడి పథకం 2020-21కు సంబంధించి విద్యార్థులు తమ వివరాలను వెబ్ పోర్టల్ ద్వారా చూసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.

  • Ravi Kiran
  • Publish Date - 8:25 am, Fri, 11 December 20
Ammavodi Scheme: 'జగనన్న అమ్మఒడి' వివరాలను చెక్ చేసుకోండి.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..

Ammavodi Scheme: నవరత్నాల్లో భాగమైన ‘అమ్మ ఒడి’ పధకాన్ని జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే అమ్మ ఒడి పథకం 2020-21కు సంబంధించి విద్యార్థులు తమ వివరాలను వెబ్ పోర్టల్ ద్వారా చూసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకులు తమ వివరాలు పోర్టల్‌లో సరి చూసుకోవాలని తెలిపింది.

వెబ్ పోర్టల్‌లో నమోదైన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, రైస్ కార్డు నెంబర్ వంటి వివరాల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. వెంటనే స్కూల్ హెడ్ మాస్టర్‌, కాలేజీ ప్రిన్సిపళ్లను సంప్రదించి సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, అమ్మఒడి పధకం ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి ఏటా రూ.15 వేల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది.

Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..