Eluru Mystery Disease: ఏలూరు వింత వ్యాధిపై కొనసాగుతున్న అధ్యయనం.. బయటపడిన మరో కొత్త విషయం..! అదేంటంటే.?

ఏలూరు వింత వ్యాధి మూలాలపై రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. మొదట బాధితుల రక్తంలో సీసం, నికెల్‌ లాంటి లోహాలు ఉన్నాయని చెప్పారు.

Eluru Mystery Disease: ఏలూరు వింత వ్యాధిపై కొనసాగుతున్న అధ్యయనం.. బయటపడిన మరో కొత్త విషయం..! అదేంటంటే.?
Follow us

|

Updated on: Dec 11, 2020 | 8:51 AM

Eluru Mystery Disease: ఏలూరు వింత వ్యాధి మూలాలపై రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. మొదట బాధితుల రక్తంలో సీసం, నికెల్‌ లాంటి లోహాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఆర్గానోక్లోరిన్స్ కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకొచ్చింది. అదే డైక్లోరో మిథేన్‌. అవునండీ..! కొద్దిరోజులుగా ఏలూరు ప్రజలను వణికిస్తున్న వింత వ్యాధికి డైక్లోరో మిథేన్‌ కారణమని తెలుస్తోంది.

తాజాగా ఏలూరులోని 20 ప్రాంతాల నుంచి సేకరించిన నీటి నమూనాలను అధికారులు హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపారు. అక్కడ వాటర్‌ శాంపిల్స్‌పై అన్నీ రకాలు పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఓ షాకింగ్‌ విషయం వెలుగు చూసింది. ఆ వాటర్‌లో డైక్లోరోమిథేన్‌ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. సాధారణంగా డైక్లోరోమిథేన్‌ ఒక లీటరు నీటిలో 5 మైక్రో గ్రాముల వరకు ఉంటే ఫర్వాలేదు. అయితే ఆ స్థాయిని మించితే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పత్తేబాద అనే ప్రాంతం నుంచి సేకరించిన నీటి నమూనాల్లో ఏకంగా 960 మైక్రోగ్రాముల డైక్లోరోమిథేన్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే అశోక్‌ నగర్‌లో 618 మైక్రో గ్రాములు ఉంది.

సాధారణంగా వాటర్‌లో డైక్లోరోమిథేన్‌ మోతాదుకు మించి ఉంటే వాంతులు, నోటి నుంచి నురగ, కళ్లు తిరగడం, ఫిట్స్‌ రావడం లాంటి లక్షణాలు కన్పిస్తాయని వైద్యులు చెబుతున్నారు. డైక్లోరోమిథేన్‌ను పెయింట్‌ రిమూవింగ్‌, రూమ్‌ స్ప్రే, హెయిర్‌ స్ప్రేలలో ఎక్కువగా వాడుతారు. ఇది ఏ రూపంలోనైనా శరీరంలోకి చేరితే ఇలాంటి అనారోగ్య సమస్యలే వస్తాయి.

కాగా, ఏలూరులోని డ్రింకింగ్ వాటర్ పలు రకాల రసాయనాలు కారణంగా కలుషితం కావడంతోనే వందలాది మంది అస్వస్థతకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వందల నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపిన వైద్య బృందాలు తుది నివేదికలు సిద్ధం చేశాయి. సీసీఎంబీ మినహా జాతీయ సంస్థలు ఇవాళ మధ్యాహ్నం నివేదికలు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ నివేదికలన్నీ పరిశీలించిన తర్వాత ఏలూరులో వింతవ్యాధికి అసలు కారణమేంటనేది తేలనుంది. వ్యాధికి కారణమేంటో తెలిసిన తర్వాత.. ఆ ప్రమాదకర రసాయనాలు తాగునీరులోకి ఎలా చేరాయన్నది తేల్చాల్సి ఉంటుంది.

Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..