రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..

రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. కొన్ని స్పెషల్ ట్రైన్స్‌కు సంబంధించిన తేదీలు, సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు..  కీలక సమాచారం ఇదే..
Follow us

|

Updated on: Dec 10, 2020 | 3:12 PM

Special Trains Time Change: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. కొన్ని స్పెషల్ ట్రైన్స్‌కు సంబంధించిన తేదీలు, సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రయాణీకుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని కోరారు.

భువనేశ్వర్-తిరుపతి-భువనేశ్వర్(08479/80): డిసెంబర్ 12వ తేదీ నుంచి 26 వరకు ప్రతీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి బయల్దేరుతుంది.. మరుసటి రోజు ఉదయం 8.10కి తిరుపతి చేరుతుంది. అలాగే 08480 నెంబర్‌తో ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతీ ఆదివారం ఉదయం 10.25కి బయల్దేరి.. భువనేశ్వర్ తర్వాతి రోజు ఉదయం 5.55కు చేరుకుంటుంది.

భువనేశ్వర్‌–చెన్నై సెంట్రల్‌- భువనేశ్వర్(02839/40): డిసెంబర్ 17 నుంచి 31 వరకూ ప్రతీ గురువారం 02839 నెంబర్‌తో ఈ రైలు మధ్యాహ్నం 12.10కి భువనేశ్వర్ నుంచి బయల్దేరి.. ఆ తర్వాతి రోజు చెన్నై సెంట్రల్‌కు ఉదయం 7.40కి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 02840 నెంబర్‌తో ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకూ ప్రతీ శుక్రవారం రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయల్దేరి.. భువనేశ్వర్‌కు రెండో రోజు ఉదయం 5.55కి చేరుతుంది.

భువనేశ్వర్‌–బెంగళూరు-భువనేశ్వర్(02845/46): డిసెంబర్ 13 నుంచి 27 వరకూ ప్రతీ ఆదివారం 02845 నెంబర్‌తో ఈ రైలు ఉదయం 7.30 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరి.. ఆ తర్వాతి రోజు బెంగళూరు‌కు ఉదయం 9.50కి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 02846 నెంబర్‌తో ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతీ మంగళవారం సాయంత్రం 4.45కి బెంగళూరు నుంచి బయల్దేరి.. భువనేశ్వర్‌కు రెండో రోజు సాయంత్రం 6.15కి చేరుతుంది.

భువనేశ్వర్‌–పుదుచ్చేరి-భువనేశ్వర్(02898/97): ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతీ మంగళవారం 02898 నెంబర్‌తో ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరి.. ఆ తర్వాతి రోజు పుదుచ్చేరి మధ్యాహ్నం 12.10కి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 02897 నెంబర్‌తో ఈ నెల 16 నుంచి 30 వరకూ ప్రతీ బుధవారం సాయంత్రం 4.45కి పుదుచ్చేరి నుంచి బయల్దేరి.. భువనేశ్వర్‌కు రెండో రోజు సాయంత్రం 6.55కి చేరుతుంది.

అలాగే భువనేశ్వర్-రామేశ్వరం వీక్లి ట్రైన్(08496) ఈ నెల 11 నుంచి 25 వరకు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12.10కి భువనేశ్వర్ నుంచి బయల్దేరి.. తర్వాతి రోజు రామేశ్వరం రాత్రి 10.35కి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ రైలు 08495 నెంబర్‌తో ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతీ ఆదివారం ఉదయం 8.50కి రామేశ్వరంలో బయల్దేరి.. భువనేశ్వర్ సాయంత్రం 6.10కి చేరుకుంటుంది.

పూరి‌–చెన్నై సెంట్రల్-పూరి(02859/60): ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతీ ఆదివారం 02859 నెంబర్‌తో ఈ రైలు సాయంత్రం 5.30 గంటలకు పూరి నుంచి బయల్దేరి.. ఆ తర్వాతి రోజు చెన్నై సెంట్రల్ మధ్యాహ్నం 1.50కి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 02860 నెంబర్‌తో ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతీ సోమవారం సాయంత్రం 4.25కి చెన్నై సెంట్రల్ నుంచి బయల్దేరి.. పూరికి రెండో రోజు మధ్యాహ్నం 1.45కి చేరుతుంది.

విశాఖపట్నం‌–హజ్రత్ నిజాముద్దీన్-విశాఖపట్నం(02851/52): ఈ నెల 11 నుంచి 28 వరకూ ప్రతీ సోమవారం, శుక్రవారం 02851 నెంబర్‌తో ఈ రైలు ఉదయం 8.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి.. ఆ తర్వాతి రోజు హజ్రత్‌ నిజాముద్దీన్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 02852 నెంబర్‌తో ఉదయం 5.10కి హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బయల్దేరి.. విశాఖకు రెండో రోజు మధ్యాహ్నం 2.15కి చేరుతుంది.

విశాఖపట్నం‌–చెన్నై సెంట్రల్-విశాఖపట్నం(02869/70): ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతీ సోమవారం 02869 నెంబర్‌తో ఈ రైలు రాత్రి 7.05 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి.. ఆ తర్వాతి రోజు చెన్నై‌కు ఉదయం 7.40 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 02870 నెంబర్‌తో ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతీ మంగళవారం ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయల్దేరి.. విశాఖకు రెండో రోజు రాత్రి 10.30కి చేరుతుంది.

విశాఖపట్నం‌–కడప-విశాఖ(07488/87): ఈ నెల 12 నుంచి 31 వరకూ ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటలకు 07488 నెంబర్‌తో ఈ రైలు విశాఖపట్నం నుంచి బయల్దేరి.. ఆ తర్వాతి రోజు కడప ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 07487 నెంబర్‌తో ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకు ప్రతీ రోజు సాయంత్రం 5.45 కి కడప నుంచి బయల్దేరి.. విశాఖకు రెండో రోజు ఉదయం 11.30కి చేరుతుంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.