AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘కరోనా వైరస్’.. ఇందులో తనది డిఫరెంట్ రోల్ అని చెబుతున్న గ్లామర్ గర్ల్..

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ ఎలాంటి వాడో అందరికి తెలిసిన విషయమే. ఆయన చేసిన సినిమాలు, చేస్తున్న

ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'కరోనా వైరస్'.. ఇందులో తనది డిఫరెంట్ రోల్ అని చెబుతున్న గ్లామర్ గర్ల్..
uppula Raju
|

Updated on: Dec 11, 2020 | 9:03 AM

Share

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ ఎలాంటి వాడో అందరికి తెలిసిన విషయమే. ఆయన చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాలు ఎన్నో వివాదాలు, కోర్టు తీర్పులు ఎదుర్కొని ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. కరెంట్ ఇష్యూస్‌ని తీసుకొని సినిమాలు తీయడంలో రామ్‌ గోపాల్‌ వర్మకు ఎవరూ సాటిరారు. తాజాగా ఆయన ఫ్యాక్టరీ నుంచి కరోనా వైరస్ సినిమా రిలీజ్ అవుతోంది. లాక్‌డౌన్‌లో అందరు ఇంట్లో ఉంటే వర్మ మాత్రం సినిమాల మీద సినిమాలు తీసేశారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఫేమ్‌ అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన గ్లామర్ గర్ల్ దక్షి గుత్తికొండ తన క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చింది. ”సామాజిక మాధ్యమాల్లో ఉన్న నా గ్లామర్‌ ఇమేజ్‌కి, ఈ సినిమాలోని నా పాత్రకి అస్సలు సంబంధం ఉండదు. ఒక తెలుగు కుటుంబంలో తమిళ కోడలి పాత్రలో కనిపిస్తాను. సినిమాలో వంశీ చాగంటి భార్య పాత్ర నాది. నా మొదటి సినిమాలోనే డీ గ్లామర్‌ పాత్ర చెయ్యటం చాలెంజింగ్‌గా అనిపించింది” అని తన మనసులోని మాటలను తెలియజేసింది ఈ అమ్మడు. అయితే ఇప్పడిప్పుడే ప్రారంభమవుతున్న తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని కేవలం ఇలాంటి పాత్రలే చేస్తానని పరిమితం కానని చెబుతోంది. అవసరమైతే కథకు తగ్గట్లుగా గ్లామర్, రొమాంటిక్‌గా కూడా నటిస్తానని తేల్చిచెప్పింది. కాగా తనకు మొదటి అవకాశం ఇచ్చిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను మరిచిపోలేనని, ఎల్లప్పుడు అతడికి రుణపడి ఉంటానని తెలిపింది దక్ష.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి