రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2000.. ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోండిలా.!

కొత్త సంవత్సరం వేళ రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం మూడో విడత డబ్బులు రూ.2000లను బ్యాంకు అకౌంట్లలోకి జమ చేయనున్నట్లు ప్రకటించింది. వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని రైతులందరికీ రూ.13,500 జమ చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రూ.11,500 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయగా.. మూడో విడతగా రూ.2000లను కూడా బదిలీ చేస్తోంది. ఇక ఈ పథకం ద్వారా […]

రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2000.. ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోండిలా.!
Follow us

|

Updated on: Jan 04, 2020 | 12:31 PM

కొత్త సంవత్సరం వేళ రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం మూడో విడత డబ్బులు రూ.2000లను బ్యాంకు అకౌంట్లలోకి జమ చేయనున్నట్లు ప్రకటించింది. వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని రైతులందరికీ రూ.13,500 జమ చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రూ.11,500 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయగా.. మూడో విడతగా రూ.2000లను కూడా బదిలీ చేస్తోంది. ఇక ఈ పథకం ద్వారా ఆర్ధిక సాయం పొందిన లబ్ధిదారుల జాబితాను శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచుతారు. మూడో  విడత డబ్బులు వచ్చాయో లేదో ఆన్లైన్‌ ద్వారా తెలుసుకోండి ఇలా..

1. ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా అఫీషియల్ వెబ్‌సైట్ https://ysrrythubharosa.ap.gov.in/ కు వెళ్ళండి.

2. హోమ్ పేజీలో కనిపించిన Payment Status ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

3. తరువాత మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

4. సబ్‌మిట్ నొక్కితే చాలు.. మీకు మూడో విడత డబ్బులు వచ్చాయో లేదో తెలుస్తుంది