‘జబర్దస్త్’లో నాగబాబు స్థానాన్ని భర్తీ చేసేది వీళ్లేనా.?
సుమారు ఏడేళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఏకైక షో ‘జబర్దస్త్’. ఇది కేవలం కామెడీ షో మాత్రమే కాదు.. అదోక బ్రాండ్ అని చెప్పాలి. అంచలంచలుగా ఎదుగుతూ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా స్టార్లు సైతం ఇందులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక షో ఇంత పెద్ద హిట్ కావడానికి కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లతో పాటుగా జడ్జ్‌ల ప్రమేయం కూడా […]

సుమారు ఏడేళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఏకైక షో ‘జబర్దస్త్’. ఇది కేవలం కామెడీ షో మాత్రమే కాదు.. అదోక బ్రాండ్ అని చెప్పాలి. అంచలంచలుగా ఎదుగుతూ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా స్టార్లు సైతం ఇందులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక షో ఇంత పెద్ద హిట్ కావడానికి కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లతో పాటుగా జడ్జ్‌ల ప్రమేయం కూడా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు షో నుంచి తప్పుకున్న సంగతి విదితమే. ఆయన తన మకాంను జీతెలుగుకు మార్చుకుని ‘అదిరింది’ అనే షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి రోజా ఒక్కరే ‘జబర్దస్త్’ షో ను నడిపిస్తున్నారు. ఇంతవరకు నిర్వాహకులు నాగబాబు రీ-ప్లేస్‌మెంట్‌ను మాత్రం భర్తీ చేయలేకపోయారు. బండ్ల గణేష్, ‘మా’ అధ్యక్షుడు నరేష్ పేర్లు వినిపించినా ఎవరూ కూడా కన్ఫర్మ్ కాలేదు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో స్పెషల్ గెస్ట్ వస్తున్నారు.. వెళ్తున్నారు.
ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ రెండు ఎపిసోడ్లకు వరుసగా వస్తే.. పోసాని కృష్ణమురళీ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు జడ్జ్‌గా వస్తున్నారు. ఈ క్రమంలోనే షో నిర్వాహకులు తొందరగా నాగబాబు స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్నారట. తరుణ్ భాస్కర్ అయితే ఎక్కువ రోజులు ఉండటం కష్టం. కానీ పోసాని మాత్రం కంటిన్యూ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో నిర్వాహకులు ఎవరిని రీ-ప్లేస్ చేస్తారో వేచి చూడాలి.





