ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు..!
మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఇప్పటివరకు అందించిన ఉచిత్ర వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Jagan Government Good News: మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఇప్పటివరకు అందించిన ఉచిత వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ఇది వర్తించనుండగా.. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు వచ్చి పని చేస్తున్న వారికి మాత్రమే ఇది అమలు కానుంది. గతంలో ఈ గడువు 2020, ఆగష్టు 1తో ముగియడంతో.. ఇప్పుడు ఆ గడువును 2021, జూన్ 31వ తేదీ వరకు పొడిగించింది. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)
రెయిన్ ట్రీ పార్క్‌లోని 3 బెడ్ రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లలో సదరు ఉద్యోగినులు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి పరిస్థితులను పరిశీలించి.. ప్లాట్ల లీజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.