తెలంగాణలో సెప్టెంబర్ 14 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు..!

కరోనా కారణంగా వాయిదాపడిన పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే యూనివర్సిటీ రిజిస్ట్రార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది...

తెలంగాణలో సెప్టెంబర్ 14 నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలు..!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2020 | 1:57 AM

Degree And PG Exams: కరోనా కారణంగా వాయిదాపడిన పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో సెప్టెంబర్ 14 నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను యూనివర్సిటీలు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, పీజీ, డిగ్రీ బ్యాక్‌లాగ్‌ పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహించాలని, ఇందుకు యూజీసీ అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)