విశాఖపై జగన్ సమీక్ష.. కలెక్టర్‌ని ఏమడిగారంటే?

ఏపీ మూడు రాజధానులుండే ఛాన్స్ వుందంటూ అసెంబ్లీలో ప్రకటన చేయకముందే ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంపై దృష్టి పెట్టారా ? అక్కడి పరిస్థితులపై సమగ్ర సర్వే చేసేశారా ? విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించిన వివరాల ప్రకారం అవుననే అనాల్సి వస్తుంది. అసెంబ్లీ ఆఖరు రోజున సడన్‌గా ఏపీకి మూడు రాజధానులుండే ఛాన్స్ వుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తర్వాత ఏపీవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తగా.. అమరావతి రాజధాని ఏరియాలో మాత్రం ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖలోనే […]

విశాఖపై జగన్ సమీక్ష.. కలెక్టర్‌ని ఏమడిగారంటే?
Rajesh Sharma

|

Dec 21, 2019 | 3:37 PM

ఏపీ మూడు రాజధానులుండే ఛాన్స్ వుందంటూ అసెంబ్లీలో ప్రకటన చేయకముందే ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంపై దృష్టి పెట్టారా ? అక్కడి పరిస్థితులపై సమగ్ర సర్వే చేసేశారా ? విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించిన వివరాల ప్రకారం అవుననే అనాల్సి వస్తుంది.

అసెంబ్లీ ఆఖరు రోజున సడన్‌గా ఏపీకి మూడు రాజధానులుండే ఛాన్స్ వుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తర్వాత ఏపీవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తగా.. అమరావతి రాజధాని ఏరియాలో మాత్రం ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖలోనే ఎక్కువ ప్రభుత్వ కార్యకలాపాలు జరిగే ఛాన్స్ కనిపించడంతో ఉత్తరాంధ్ర వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, విశాఖ ఎంపిక ఆషామాషీగా జరగలేదని, అందుకు జగన్ తగిన కసరత్తు గతంలోనే చేశారని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ చెబుతున్నారు.

ఇటీవల సీఎం జగన్ అర్బన్ ఏరియా డెవలప్‌మెంట్‌కి సంబంధించి సమీక్ష జరిపారని అందులో విశాఖ నగరం గురించి పలు అంశాలపై క్లారిటీ తీసుకోవడంతోపాటు కొన్ని సూచనలు చేశారని విశాఖ కలెక్టర్ చెప్పారు. విశాఖకు సంబంధించి త్రాగునీరు, మెట్రో రైలు, అంతర్గత రోడ్లు, మాస్టర్ ప్లాన్‌పై సీఎం సుదీర్ఘ సమీక్ష చేశారని ఆయన అన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై సీఎం కొన్ని మార్పులు చేర్పులు సూచించారని తెలిపారు.

విశాఖ సమీప ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో వుందని, వాటిలో కార్యాలయాల నిర్మాణాలు జరుపుకోవచ్చన్న అంశం సీఎం సమీక్షలో తేలిందన్నారు కలెక్టర్. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే వీలైనంత త్వరగా రాజధాని తరలింపునకు చర్యలు తీసుకుంటామని అంటున్న కలెక్టర్, విశాఖలో జివిఎంసి, విఎంఆర్డీఏ, జిల్లా అధికార య౦త్రా౦గ౦ అనేక వింగ్స్ అందుకోసం సిద్దంగా ఉన్నాయని తెలిపారు.

మిలీనియం టవర్‌లో సెక్రెటేరియట్

విశాఖ నగరంలో రెండేళ్ళ క్రితం నిర్మించిన మిలీనియం టవర్లలో ఏపీ సెక్రెటేరియట్ ఏర్పాటు చేస్తారని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఐటి సంస్థల కోసమని మిలీనియం టవర్లను 2017 నిర్మించారు. వీటి నిర్మాణం 2018లోనే పూర్తి కాగా.. ఒకే ఐటీ కంపెనీ ఇందులో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం విశాఖలోనే సెక్రెటేరియట్ పెట్టాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చేసినందున వినియోగానికి సిద్దంగా వున్న మిలీనియం టవర్లలోకే సెక్రెటేరియట్‌ను తరలిస్తారని చెప్పుకుంటున్నారు. రెండు టవర్లు కలిపి దాదాపు వేయి కార్లను పార్క్ చేసుకునే ఛాన్స్ వుండడంతోపాటు.. ప్లగ్ అండ్ ప్లే పరిస్థితి వుండడంతో మిలీనియం టవర్లనే ప్రభుత్వం ముందుగా ఎంచుకోవచ్చని తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu