Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jackfruit: పనస పండు వల్ల అద్భుతమైన ఉపయోగాలు.. రోగనిరోధక శక్తి పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్న నిపుణులు

Jackfruit: ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. రోగ నిరోధక శక్తి ఉంటే కరోనా నుంచే కాకుండా ఇతర వ్యాధుల నుంచి కూడా రక్షించుకోవచ్చు...

Jackfruit: పనస పండు వల్ల అద్భుతమైన ఉపయోగాలు.. రోగనిరోధక శక్తి పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్న నిపుణులు
Jackfruit
Follow us
Subhash Goud

|

Updated on: May 22, 2021 | 4:00 PM

Jackfruit: ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. రోగ నిరోధక శక్తి ఉంటే కరోనా నుంచే కాకుండా ఇతర వ్యాధుల నుంచి కూడా రక్షించుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ముందుగా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడే దాని నుంచి కాపాడుకోవచ్చు. ఈ విషయంలో వైద్య నిపుణులు పదేపదే సూచిస్తున్నారు. ఒక్క కరోనా నుంచే కాకుండా వివిధ రకాల అంటు వ్యాధుల నుంచి కూడా రక్షించుకోవచ్చు. అయితే మీరు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అనేకమైన మార్గాలున్నాయి. ప్రముఖ పోషకాహార నిపుణుడు రుజుటా దివేకర్‌ రోగనిరోధక శక్తి పెంచే ఆహారం జాక్‌ ఫ్రూట్‌ (పనస పండు) యొక్క ప్రయోజనాలేంటే చెబుతున్నారు. శరీరంలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే జాక్‌ఫ్రూట్‌ విత్తనాలను తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. వాటికి ఉప్పు, మిరియాలతో ఉడికించి లేదా వేయించి రుచికరమైన ఆహారం తయారు చేసుకోవచ్చంటున్నారు. జింక్‌, విటమిన్లు, ఫైబర్‌ వంటి ఖనిజాలతో సమృద్దిగా ఉండే ఇవి మీ ఆహారంలో జోడించి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని రుజుటా దివేకర్‌ వివరిస్తున్నారు.

పనస పండు (జాక్‌ఫ్రూట్‌) వల్ల కలిగే లాభాలు:

➦ జాక్‌ఫ్రూట్‌ (పనస పండు)లో ఇనుము, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్‌, ప్రోటీన్లు అధిక సంఖ్యలో ఉంటాయి.

➦ పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.

➦ పరస పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా ఇతర వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది.

➦ పనస తొనలు తినడం ద్వారా మగవారిలోవీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

➦ పనసలో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టుల ఆరోగ్యంతో ఉండేలా ఎంతగానో ఉపయోగపడుతుంది.

➦ ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. ఇక రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.

➦ ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి, గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.

➦ పనస పండు షుగరు వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారంగా చెప్పాలి. దీనిని తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది.

➦ పనస పండులోని కాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే పైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాసు మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Diabetic: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా..? మీ రోజు వారీ ఆహారంలో వేరుశనగలు జోడించండి..!

Heart Pain: గుండెనొప్పి వచ్చిన వారికి మొదటి గంట సమయమే ముఖ్యం.. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువ..!

Children Covid-19: పిల్లల్లో కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి..? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే..!