రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే..!
శభాష్ రోజమ్మా.. నీ టైమింగ్‌కి.. అని ఇప్పుడు ఆమెను పొగడని వారు లేరు. ఏ ప్రోగ్రామ్ చూసినా ఆమెనే. అటు పొలిటికల్‌గా హీట్‌ని రాజేస్తూ.. ఇటు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా నవ్వులు చిందిస్తూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నారు..
శభాష్ రోజమ్మా.. నీ టైమింగ్‌కి.. అని ఇప్పుడు ఆమెను పొగడని వారు లేరు. ఏ ప్రోగ్రామ్ చూసినా ఆమెనే. అటు పొలిటికల్‌గా హీట్‌ని రాజేస్తూ.. ఇటు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా నవ్వులు చిందిస్తూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నారు రోజా. చాలా మంది నటులు రాజకీయాలకు వెళ్తే.. సినీ ప్రపంచానికి దూరమవుతూంటారు. ఎందుకంటే.. ఆ బిజీ అలాంటిది మరి. కానీ.. రోజా మాత్రం రెండూ మెయిన్‌టైన్ చేస్తూ వస్తున్నారు. నాగబాబు వెళ్లిపోయాక.. ముఖ్యంగా ఇప్పుడు జబర్దస్త్‌లో ఆమెనే కీ రోల్ పోషిస్తున్నారు. అప్పుడప్పుడూ బ్రేక్ తీసుకున్నా కూడా.. మళ్లీ వెంటనే బుల్లితెరపై తలుక్కుమంటున్నారు. ఇప్పుడు తాజాగా మరో టీవీ ఛానెల్‌లోనూ కనిపించబోతున్నారు.
అయితే.. రోజా బిజీ షెడ్యూల్ చూసి టాప్ యాంకర్స్ అందరూ షాక్ అవుతున్నారు. మేమన్నా.. అప్పుడప్పుడు కుదరక.. బ్రేక్ తీసుకుంటూంటాం. కానీ మీరెలా టైమ్‌ని మేనేజ్ చేస్తున్నారంటూ.. అవాక్కైపోతున్నారు. ఎందుకంటే.. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. కాగా తాజాగా 2020లో వచ్చే ఉగాది పండుగకు మల్లెమాల ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌లో కనిపించారు. ఓ ఎమ్మెల్యే అయినప్పటికీ.. తన సినీ వృత్తికి న్యాయం చేస్తూ.. మళ్లీ ఓ మంచి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్‌తో సామజవరగమనా, మైండ్ బ్లాక్ పాటకు కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు రోజా.
ఇదిలా ఉంటే రోజా టైమ్ మేనేజ్ మెంట్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్యే ఓ స్కిట్‌లో ప్రశ్నకు సమాధానంగా కూడా.. ‘పని చేతకాని వాళ్లు మీడియాను మేనేజ్ చేస్తే.. తాను టైమ్‌ని మేనేజ్ చేస్తానని’ చెప్పుకొచ్చారు. కేవలం జబర్దస్త్ షోకు మాత్రమే కాకుండా.. న్యూయర్ ప్రోగ్రామ్, సంక్రాంతి ప్రోగ్రామ్.. ఉగాది ఇలా అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ ఆమె లేనిదే జరగడం లేదంటే అతిశయోక్తి కాదు.
Read More this also: రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు
షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి