జమ్మూ కాశ్మీర్ : ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత బలగాలు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లతో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టుల ఏరివేతపై భద్రతా దళాలు ఫోకస్ పెట్టాయి. వరస సెర్చ్ ఆపరేషన్లతో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లతో ముష్కరులను ఖతం చేస్తున్నాయి. తాజాగా పుల్వామాలోని జధోరా ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోదాలు చేస్తోన్న భద్రతా బలగాలపైకి ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో దీటుగా ప్రతి స్పందించిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఓ జవాన్ తీవ్రంగా గాయపడి మరణించినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో గాలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నాయి భారత బలగాలు.
Also Read :
తమ్ముని పేరుతో అన్న ప్రభుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు