ఫ్యాన్స్‌కు మన్మథుడి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్

60 ఏళ్ల నవ మన్మథుడు...టాలీవుడ్‌ కింగ్ నాగార్జున అక్కినేని.. ప్రేమ కథా చిత్రాల్లో నటించి యువతుల మనసులను గెలుచుకున్నారు. అమ్మాయిల గుండెల్లో నవ మన్మథుడిగా నిలిచిపోయారు. 34 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు....

ఫ్యాన్స్‌కు మన్మథుడి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్
Sanjay Kasula

|

Aug 29, 2020 | 11:32 AM

60 ఏళ్ల నవ మన్మథుడు…టాలీవుడ్‌ కింగ్ నాగార్జున అక్కినేని.. ప్రేమ కథా చిత్రాల్లో నటించి యువతుల మనసులను గెలుచుకున్నారు. అమ్మాయిల గుండెల్లో నవ మన్మథుడిగా నిలిచిపోయారు. 34 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అటు  క్లాస్ అయినా..మాస్‌ అయినా.. భక్తి అయినా.. రక్తి అయినా. అన్నింటిలో తానే బిగ్ బాస్…  అనేంతలా  స్టార్ డమ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అయితే ఈ ఏడాది తన బర్త్ డే సందర్బంగా అభిమానులకు స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం నాగ్ వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తుండ‌గా, ఆయ‌న బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానులని ఫిదా చేస్తోంది.

టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో  నాగార్జున తన ప్రత్యేకతను చాటుకుంటారు. కమర్షియల్, ఆధ్యాత్మిక సినిమాలతో పాటు ‘గగనం’, ‘ఊపిరి’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసిన నాగ్‌.. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో ‘వైల్డ్ డాగ్‌’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌తో నాగ్ టీంని ప‌రిచ‌యం చేసింది చిత్ర బృందం.

ఈ సినిమాలో నాగార్జున ఎన్‌.ఐ.ఎ (NIA) ఆఫీస‌ర్‌గా కనిపించనున్నారు. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. కిర‌ణ్ కుమార్ మాటలను అందించారు. షానియ‌ల్ డియో సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu