AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ తెరపైకి భద్రాద్రి అంశం.. ఏపీలో విలీనం.?

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయనున్నారని సమాచారం. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రాద్రిని ఏపీలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర సర్కార్ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో భేటీ అయినప్పుడు విభజన సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాచలం […]

మళ్ళీ తెరపైకి భద్రాద్రి అంశం.. ఏపీలో విలీనం.?
Ravi Kiran
|

Updated on: Jun 05, 2019 | 11:39 AM

Share

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయనున్నారని సమాచారం. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రాద్రిని ఏపీలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర సర్కార్ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో భేటీ అయినప్పుడు విభజన సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాచలం విలీనాంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు  తెలుస్తోంది. అటు భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.

ఇది ఇలా ఉండగా భద్రాద్రిని ఆంధ్రప్రదేశ్‌లో కలపాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే అసెంబ్లీ, పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగాలి. ఆ తరువాత రాష్ట్రపతి గజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అయితే ఇరు ప్రభుత్వాలు సుముఖంగా ఉంటే ఇది కష్టమేమి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా ఒకప్పుడు ఏడు మండలాలను ఏపీలో కలపడంపై అప్పట్లో తెలంగాణ ఉద్యమ సంఘాలు, టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరి ఇప్పుడు భద్రాద్రి గ్రామాన్ని కూడా ఏపీలో కలిపితే ప్రజలు నుంచి ఆందోళనలు తలెత్తే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా సున్నితమైన ఈ అంశాన్ని పరిష్కరించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కసరత్తు చేయవలసి ఉంటుంది.