ధోని ‘పొలిటికల్’ వేషం.. ఫ్యాన్స్‌కు పరేషాన్!
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పారా మిలిటరీలో డ్యూటీ ముగించుకుని ప్రస్తుతం ఇంటికి చేరుకున్నాడు. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని ఉద్రిక్త పరిస్థితుల మధ్య జమ్మూకాశ్మీర్‌లో దేశం కోసం సేవలు అందించాడు. కాగా ట్రైనింగ్ సమయంలో కశ్మీర్‌లోని బారాముల్లా, సోఫియన్ వంటి ప్రాంతాల్లో ధోనీ పర్యటించాడు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ధోని రాజకీయ నాయకుడి దుస్తుల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోనీ మిత్రుడు మిహిర్ దివాకర్ […]
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పారా మిలిటరీలో డ్యూటీ ముగించుకుని ప్రస్తుతం ఇంటికి చేరుకున్నాడు. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని ఉద్రిక్త పరిస్థితుల మధ్య జమ్మూకాశ్మీర్‌లో దేశం కోసం సేవలు అందించాడు. కాగా ట్రైనింగ్ సమయంలో కశ్మీర్‌లోని బారాముల్లా, సోఫియన్ వంటి ప్రాంతాల్లో ధోనీ పర్యటించాడు.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ధోని రాజకీయ నాయకుడి దుస్తుల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోనీ మిత్రుడు మిహిర్ దివాకర్ ధోనీ రాజకీయ నేతగా ఉన్న ఫొటోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా ఆ మధ్య ధోని రాజకీయాల్లోకి వస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫోటోలు చూసి నిజంగా వస్తున్నాడేమో అని ఊహించుకోవద్దు. ఇది కేవలం యాడ్ షూట్ మాత్రమే.
MS Dhoni’s New Avatar In AD Shoot ❤? #MSDhoni #Dhoni pic.twitter.com/0GMIwTKLGB
— Sanjay Msd (@SanjayMsd07) August 22, 2019