ఆర్చర్ ‘ఓవరాక్షన్’.. నెటిజన్ల షాకింగ్ ‘రియాక్షన్’

ఆర్చర్ 'ఓవరాక్షన్'.. నెటిజన్ల షాకింగ్ 'రియాక్షన్'

ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ ద్వారా టెస్ట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇలా వచ్చాడో లేదో తన పదునైన బంతులు, బౌన్సర్లతో ఆసీస్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తిస్తుండటం విశేషం. ఇక రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ వేసిన ఓ షాట్‌పిచ్‌ బంతి మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ మెడకు బలంగా తాకడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స చేసినా లాభం లేకపోవడంతో ..అతడి స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిగా మార్నస్‌ లబుషేన్‌ క్రీజులకి […]

Ravi Kiran

|

Aug 22, 2019 | 7:02 PM

ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ ద్వారా టెస్ట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇలా వచ్చాడో లేదో తన పదునైన బంతులు, బౌన్సర్లతో ఆసీస్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తిస్తుండటం విశేషం. ఇక రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ వేసిన ఓ షాట్‌పిచ్‌ బంతి మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ మెడకు బలంగా తాకడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స చేసినా లాభం లేకపోవడంతో ..అతడి స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిగా మార్నస్‌ లబుషేన్‌ క్రీజులకి వచ్చి ఆసీస్‌ను ఆదుకున్నాడు. ఆర్చర్ దాడికి లబుషేన్‌ కూడా గాయపడిన విషయం తెలిసిందే.

మరోవైపు గాయం కారణంగా స్టీవ్ స్మిత్ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. దీనిని ఉద్దేశించి ఆర్చర్ ఓ ట్వీట్ చేశాడు. ‘ఓ పెద్దాయన సోఫా మీద నుంచి కర్ర సహాయంతో పైకి లేవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ కర్ర కిందపడే జిఫ్‌ను జత చేసి… ‘ ఇవాళ ఉదయం బెడ్ మీద నిద్ర లేచేసరికి నేను ఇలా ఉంటా’ అని పేర్కొన్నాడు.

ఇది చూసిన ఓ నెటిజన్‌ ‘తలలేని ఓ వ్యక్తి బాల్కనీలో నిలబడే’ జిఫ్‌ ఫైల్‌ను జత చేసి రీట్వీట్‌ చేశాడు. ‘స్టీవ్ స్మిత్ ఉదయం ఇలా లేచాడు’ అని పోస్ట్ పెట్టాడు. నెటిజన్ పెట్టిన పోస్ట్ చూసి ప్రతిస్పందించిన ఆర్చర్‌.. సరదాగా ఉందని మరో ట్వీట్ చేసాడు.  ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu