AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌?

టీమిండియా నూతన బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది. గతవారం క్రికెట్‌ సలహా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తిరిగి ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఆయా కోచ్‌ పదవులకు గురువారం ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ బంగర్‌ దరఖాస్తు చేసుకున్నా అతడు ఇంటర్వ్యూల్లో రెండో స్థానంలో నిలిచాడని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ చెప్పారు. తొలి స్థానంలో విక్రమ్‌రాథోడ్‌, మూడో స్థానంలో ఇంగ్లాండ్‌ […]

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌?
Vikram Rathour set to replace Sanjay Bangar as batting coach
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2019 | 10:05 PM

Share

టీమిండియా నూతన బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది. గతవారం క్రికెట్‌ సలహా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తిరిగి ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ఆయా కోచ్‌ పదవులకు గురువారం ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ బంగర్‌ దరఖాస్తు చేసుకున్నా అతడు ఇంటర్వ్యూల్లో రెండో స్థానంలో నిలిచాడని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ చెప్పారు. తొలి స్థానంలో విక్రమ్‌రాథోడ్‌, మూడో స్థానంలో ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ మార్క్‌ రామ్‌ప్రకాశ్‌ నిలిచారని తెలిపారు. మరోవైపు బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌.శ్రీధర్‌ తమ స్థానాలను పదిలం చేసుకున్నారని తెలుస్తోంది.