IPL 2020 RR vs MI : చెలరేగిన పాండ్య..రాజస్థాన్ టార్గెట్ 196
అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది.

అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. రాజస్థాన్ ముందు 196 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా హార్దిక్ పాండ్య (60*; 21 బంతుల్లో 2×4, 7×6) చెలరేగిపోగా… సూర్యకుమార్ యాదవ్ (40; 26 బంతుల్లో 4×4, 1×6), ఇషాన్ కిషన్ (37; 36 బంతుల్లో 4×4, 1×6), సౌరభ్ తివారి (33*; 23 బంతుల్లో 4×4, 1×6) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ గోపాల్ 2 వికెట్లు తీశాడు.
ఆరంభంలోనే క్వింటన్ డికాక్ పెవిలియన్‌కు చేరడంతో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను సరిచేశాడు. మరో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆఖర్లో సౌరభ్, హార్దిక్ కీలక పార్టనర్షిప్ నెలకొల్పడంతో ముంబై స్కోరు అమాంతం దూసుకెళ్లింది. హార్దిక్ బౌండరీలతో చెలరేగిపోయాడు.
Also Read :
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ