AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: బ్యాంకులను మించి.. ఈ పోస్టాఫీస్ పథకాలతో మీ డబ్బు డబుల్..

ఆర్బీఐ రెపో రేట్లు తగ్గించడంతో బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి. ఒకవైపు బ్యాంక్ ఎఫ్డీల ఆదాయం తగ్గుతుంటే, మరోవైపు పోస్టాఫీసు పథకాలు మాత్రం 7 శాతం కంటే ఎక్కువ రాబడితో అద్భుతమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మరి ఈ తరుణంలో సామాన్యులకు ఎక్కువ ఆదాయం ఎందులో వస్తుంది అనేది ఇప్పడు తెలుసుకుందాం..

Post Office: బ్యాంకులను మించి.. ఈ పోస్టాఫీస్ పథకాలతో మీ డబ్బు డబుల్..
Bank Fd Vs Post Office Schemes
Krishna S
|

Updated on: Jan 12, 2026 | 2:48 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 0.25శాతం తగ్గించింది. ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గించడం ఇది వరుసగా నాలుగోసారి. ఈ నిర్ణయం వల్ల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆధారపడే ఇన్వెస్టర్ల ఆదాయం తగ్గనుంది. ఈ నేపథ్యంలో సురక్షితమైన, అధిక రాబడినిచ్చే చిన్న పొదుపు పథకాలు సామాన్యులకు వరంలా మారాయి. సాధారణంగా రెపో రేటు తగ్గితే బ్యాంకులు తమ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి. ఇప్పటికే ప్రధాన బ్యాంకులు తమ FD రేట్లను సవరించడం ప్రారంభించాయి. దీనివల్ల పొదుపుపై వచ్చే వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

పోస్టాఫీసు పథకాలు.. 7శాతం కంటే ఎక్కువ రాబడి

బ్యాంక్ FDలతో పోలిస్తే పోస్టాఫీసు పథకాలు ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. వీటిలో వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించబడతాయి. ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం, చాలా పథకాలు 7శాతం కంటే ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి.

ప్రధాన పథకాలు – వడ్డీ రేట్లు

  • సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ – 8.2
  • సుకన్య సమృద్ధి యోజన – 8.2శాతం
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ – 7.7
  • కిసాన్ వికాస్ పత్ర – 7.5శాతం
  • మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ – 7.5శాతం
  • పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ – 7.5శాతం

పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు

ప్రభుత్వ గ్యారెంటీ: బ్యాంకుల కంటే పోస్టాఫీసు పథకాలకు కేంద్ర ప్రభుత్వం 100శాతం భద్రతను ఇస్తుంది. అంటే మీ పెట్టుబడికి ఎలాంటి నష్టం ఉండదు.

సీనియర్ సిటిజన్లకు వరం: 60 ఏళ్లు పైబడిన వారికి 8.2శాతం వడ్డీ లభించడం వల్ల పదవీ విరమణ చేసిన వారికి ఇది గొప్ప ఆదాయ వనరు.

స్థిరమైన రాబడి: మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన వడ్డీ లభిస్తుంది.

పన్ను ప్రయోజనాలు: NSC వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

ప్రస్తుతం బ్యాంక్ FD రేట్లు తగ్గుతున్న తరుణంలో, గరిష్ట రాబడి కోసం పోస్టాఫీసు పథకాలను ఎంచుకోవడం ఉత్తమం. వడ్డీ రేట్లు మరింత తగ్గకముందే మీ పెట్టుబడిని సురక్షితమైన మార్గాల్లో మళ్లించడానికి ఇదే సరైన సమయం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి