AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్ టాక్ తో పరిచయం ప్రేమ పెళ్లి.. అంతలోనే విషాదం

మరో ప్రేమకథ విశాదంగా ముగిసింది. టిక్ టాక్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతీ, యువకులు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందరిలాగే వారికీ కులం అడ్డు వచ్చింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. పెద్దల కట్టుబాట్ల జ్వాలకు రెండు ప్రాణాలు తీసుకున్నారు.

టిక్ టాక్ తో పరిచయం ప్రేమ పెళ్లి.. అంతలోనే విషాదం
Balaraju Goud
|

Updated on: Sep 04, 2020 | 10:08 AM

Share

మరో ప్రేమకథ విశాదంగా ముగిసింది. టిక్ టాక్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతీ, యువకులు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందరిలాగే వారికీ కులం అడ్డు వచ్చింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. పెద్దల కట్టుబాట్ల జ్వాలకు రెండు ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ల బెదిరింపులకు తాళలేక యువజంట ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెం ఆర్‌ అండ్‌ ఆర్‌ సెంటర్‌లో చోటుచేసుకుంది.

మునుగోడుకు చెందిన దద్దనాల సైదులు కుమారుడు పవన్‌ కుమార్‌(19), చిత్తూరు జిల్లా కోటగుడిబండ మండలం గుదిబండ గ్రామానికి చెందిన కూటాల రవీంద్ర కుమార్తె శైలజ(18) టిక్‌ టాక్‌ ద్వారా పరిచయమై ప్రేమించుకున్నారు. వారి ప్రేమ పెళ్లిపీటల దాకా వెళ్లింది. గత ఆగస్టు 3న ఇంట్లో పెద్దలకు తెలియకుండానే తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం మంగళగిరిలో పవన్‌ నివాసానికి చేరుకున్నారు. పవన్‌ మేనమామ బెల్లంకొండ మండలంలోని కందిపాడులో ఉంటున్నట్లు తెలియడంతో అక్కడికి గత నెల 20న వచ్చి విషయం తెలపడంతో వారిని మాచాయపాలెం పునరావాస కేంద్రంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పవన్‌ మేనమామ ఉంచారు. మాచాయపాలెం ఆర్‌ అండ్‌ ఆర్‌ సెంటర్‌లో కాపురం కూడా పెట్టారు.

ఇదిలావుంటే, శైలజ తల్లిదండ్రులకు మాత్రం ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శైలజ తమ పెళ్లి విషయం కువైట్‌లో ఉన్న తల్లికి చెప్పడంతో, ఆగ్రహించిన ఆమె పవన్‌ను చంపుతానని బెదిరించిందని తెలుస్తుంది. పెళ్లయితే పెద్దల మనస్సు మారుతుందన్న యువజంటకు బెదిరింపులు ఎక్కువ కావటంతో ఏం చేయాలో పాలుపోలేదు. గురువారం సాయంత్రం ఆర్‌ అండ్‌ ఆర్‌ సెంటర్‌లోని ఒక గృహంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలంలో శైలజ రాసినట్లుగా చెప్తున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన తల్లి బెదిరింపులకు పాల్పడుతున్నందువల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ లేఖలో శైలజ పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొత్త జంట ఆత్మహత్యకు పాల్పడటంతో ఆర్‌ అండ్‌ ఆర్‌ సెంటర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.