ఎస్‌బీఐ గుడ్‌న్యూస్.. కస్టమర్లకు సేఫ్టీ టిప్స్..

కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీరు ఏటీఎంకు వెళ్లి మీ బ్యాలెన్స్.. కానీ మినీ స్టేట్మెంట్ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓ మెసెజ్ పంపటం‌ ద్వారా ఖాతాధారులను అలర్ట్‌ చేయనుంది.

ఎస్‌బీఐ గుడ్‌న్యూస్.. కస్టమర్లకు సేఫ్టీ టిప్స్..
Follow us

|

Updated on: Sep 04, 2020 | 1:00 PM

కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీరు ఏటీఎంకు వెళ్లి మీ బ్యాలెన్స్.. కానీ మినీ స్టేట్మెంట్ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓ మెసెజ్ పంపటం‌ ద్వారా ఖాతాధారులను అలర్ట్‌ చేయనుంది. ఈ మెసేజ్‌ అలర్ట్‌ కారణంగా.. ఒకవేళ అనధికార లావాదేవీ జరుగుతున్నట్లయితే సదరు ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్‌ కార్డును బ్లాక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎం మోసాలను అరికట్టడానికి ఇది అరికడుతుంది. ఇటువంటి నేరాలు జరగ కుండా బ్యాంక్ తన కస్టమర్లను జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది.

“ఇప్పుడు మేము ఏటీఎంల ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ స్టేట్మెంట్ కోసం ఒక అభ్యర్థనను స్వీకరించినప్పుడు, మేము మా కస్టమర్లను ఒక ఎస్ఎంఎస్ పంపుతాం.  ఆ ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్  చేస్తాము. తద్వారా లావాదేవీ ప్రారంభించకపోతే వారు వెంటనే వారి డెబిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు” అని తన ట్వీట్‌లో ఎస్బీఐ పేర్కొంది. బ్యాంక్ తన వినియోగదారులకు వారి డబ్బును సురక్షితంగా ఉంచే మార్గాలపై చిట్కాలను కూడా ఇస్తోంది. “మీ భద్రతా వ్యవస్థలో కొంత లొసుగుల కోసం వెతుకుతున్న మోసగాళ్ళను గుర్తించడానికి మీ జ్ఞాన శక్తిని ఉపయోగించుకోండి. ఇక్కడ కొన్ని భద్రతా చిట్కాలు ఉన్నాయి” అని ఎస్‌బీఐ ట్వీట్టర్‌లో పేర్కొంది.

ఇంతకుముందు, ఎస్‌బీఐ తన వినియోగదారులను అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలో అనధికార లావాదేవీల నుంచి రక్షించడానికి కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త సౌకర్యం 2020 ప్రారంభం నుంచి పనిచేస్తోంది. ఏటీఎం కార్డుదారులకు వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) సహాయంతో నగదు ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది.