AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ ఇయర్ వేడుకలకు నగరం ముస్తాబు.. హద్దు మీరితే.. కఠిన చర్యలే!

మరి కొద్ది గంటల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. జంట నగరాల్లోని యువత కొత్త సంవత్సరానికి ఫుల్ జోష్‌లో వెల్‌కమ్ చెప్పడానికి సిద్ధమయ్యారు. దీనికి అనుగుణంగానే ప్రైవేట్ ఈవెంట్లు, పబ్బులు, క్లబ్బులు కొత్త సంవత్సరం వేడుకలకు వేదికలు అవుతున్నాయి. ఈ సందర్భంలో రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు లేకుండా న్యూ ఇయర్ పార్టీలను నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌,హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. ఈ నిబంధనలను ఈవెంట్స్‌ నిర్వహకులు, హోటల్స్‌, పబ్‌ యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు తెలిపారు. కొత్త […]

న్యూ ఇయర్ వేడుకలకు నగరం ముస్తాబు.. హద్దు మీరితే.. కఠిన చర్యలే!
Ravi Kiran
|

Updated on: Dec 31, 2019 | 1:32 PM

Share

మరి కొద్ది గంటల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. జంట నగరాల్లోని యువత కొత్త సంవత్సరానికి ఫుల్ జోష్‌లో వెల్‌కమ్ చెప్పడానికి సిద్ధమయ్యారు. దీనికి అనుగుణంగానే ప్రైవేట్ ఈవెంట్లు, పబ్బులు, క్లబ్బులు కొత్త సంవత్సరం వేడుకలకు వేదికలు అవుతున్నాయి. ఈ సందర్భంలో రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు లేకుండా న్యూ ఇయర్ పార్టీలను నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌,హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. ఈ నిబంధనలను ఈవెంట్స్‌ నిర్వహకులు, హోటల్స్‌, పబ్‌ యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు తెలిపారు.

కొత్త సంవత్సరం వేడుకల నిబంధనలు…

1.కొత్త సంవత్సరం వేడుకులను రాత్రి 8 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించాలి..

2.డీజేకు అనుమతి లేదు…

3.ఈవెంట్స్, వేడుకలకు పోలీసుల అనుమతి తప్పనిసరి…

4.ప్రజా భద్రత చట్టం-2013 ప్రకారం వేడుకలు జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌, పార్కింగ్‌ ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి…

5.ట్రాఫిక్‌ రద్దీ, జామ్‌లు తలెత్తకుండా వేడుకలు నిర్వహించే వారు ప్రైవేటు సెక్యురిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి…

6.అశ్లీలం లేకుండా వేడుకలు నిర్వహించాలి…

7.వేడుకల్లో మ్యూజిక్‌ సిస్టం సౌండ్ 45 డెసిబెల్స్‌ మించకూడదు…

8.వేడుకలు జరిగే చోట్లలో వెపన్స్‌ను అనుమతించకూడదు…

9.ఆవరణ పరిమితిని మించి టిక్కెట్‌లను విక్రయించరాదు…

10.పాసులు జారీ కూడా ఆవరణ పరిమితికి లోబడే ఉండాలి…

11.సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లను చేసుకోవాలి..

12.జంటల కోసం నిర్వహించే వేడుకల్లో మైనర్‌లను అనుమతించకూడదు…

13.డ్రగ్స్‌, మత్తు పదార్థాలు లేకుండా నిర్వహకులు బాధ్యత తీసుకోవాలి…

14.ఎౖక్సెజ్‌ శాఖ అనుమతి ఇచ్చిన సమయం దాటి మద్యం విక్రయించరాదు…

15.మందుబాబులు క్షేమంగా ఇంటికి వెళ్ళేందుకు నిర్వాహకులు డ్రైవర్లు, క్యాబ్‌లను ఏర్పాటు చేయాలి..

16.టపాసులు కాల్చకూడదు.. ఎలాంటి అపశృతులు జరిగినా నిర్వాహకులే బాధ్యత వహించాలి…

17.ఒకవేళ మత్తు పదార్ధాలు, డ్రగ్స్  విక్రయించినట్లు తెలిస్తే.. కఠిన చర్యలు తప్పవు..

18.వేడుకలను నిర్వహించే వారు తప్పని సరిగా కార్యక్రమాలు జరిగే ప్రవేశ మార్గంలో డ్రంకన్‌ డ్రైవింగ్‌ నేరమని సూచిక బోర్డులు పెట్టాలి..

19.డ్రంకన్‌ డ్రైవింగ్‌లో పట్టుబడితే వాహనం అక్కడికక్కడే సీజ్‌… 10 వేల జరిమానా..3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు..

20. 30 మైక్రో గ్రాముల ఆల్కహాల్ మించరాదు.. ఒకవేళ మించితే డ్రంకన్‌ అండ్‌ డ్రైవింగ్‌ కింద పరిగణిస్తారు

21.డెజిగ్నేటడ్‌ డ్రైవర్‌లను పెట్టుకోండి.. డ్రంక్ అండ్ డ్రైవింగ్ బెడద నుంచి తప్పించుకోండి…

22.సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్‌కు సంబంధించి సమస్యలు ఎదురైతే వెంటనే సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు వాట్సాప్‌ నెం.8500411111

23. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా, అనుమానస్పద వస్తువులు కనపడినా వెంటనే డయల్‌ 100 లేదా రాచకొండ వాట్సాప్‌ నెంబర్‌కు సమాచారం అందించాలి..