AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ మంటల్లో ‘ ఆస్ట్రేలియా..కమ్మేసిన కార్చిచ్చు.. జనాల హాహాకారాలు

ఆస్ట్రేలియాను కార్చిచ్చు కమ్మేసింది..హాట్ సమ్మర్ సీజన్ కూడా కావడంతో.. మంటలు ఉవ్వెత్తున వ్యాపిస్తున్నాయి. రెండు మూడు రోజులక్రితం అడవుల్లో మెల్లగా ప్రారంభమైన ‘ బుష్ ఫైర్స్ ‘ క్రమంగా న్యూసౌత్ వేల్స్ , విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్ లాండ్ వంటి ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. మంగళవారం గిప్స్ లాండ్ సమీపంలోని ‘ మల్లకూట ‘ బీచ్ లో ఎటూ వెళ్లలేక దాదాపు 4 వేల మందికి పైగా చిక్కుకుపోయారు. ముఖాలకు గ్యాస్ మాస్కులు ధరించిన వీరిలో చాలామంది […]

' మంటల్లో ' ఆస్ట్రేలియా..కమ్మేసిన కార్చిచ్చు.. జనాల హాహాకారాలు
Anil kumar poka
|

Updated on: Dec 31, 2019 | 12:15 PM

Share

ఆస్ట్రేలియాను కార్చిచ్చు కమ్మేసింది..హాట్ సమ్మర్ సీజన్ కూడా కావడంతో.. మంటలు ఉవ్వెత్తున వ్యాపిస్తున్నాయి. రెండు మూడు రోజులక్రితం అడవుల్లో మెల్లగా ప్రారంభమైన ‘ బుష్ ఫైర్స్ ‘ క్రమంగా న్యూసౌత్ వేల్స్ , విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్ లాండ్ వంటి ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. మంగళవారం గిప్స్ లాండ్ సమీపంలోని ‘ మల్లకూట ‘ బీచ్ లో ఎటూ వెళ్లలేక దాదాపు 4 వేల మందికి పైగా చిక్కుకుపోయారు. ముఖాలకు గ్యాస్ మాస్కులు ధరించిన వీరిలో చాలామంది దగ్గరలోని ఓ షెల్టర్ లో తలదాచుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో లైఫ్ జాకెట్లు ధరించిన అనేకమందిని సముద్రంలోకి దిగి.. నీటిలోనే ఉండాల్సిందిగా అధికారులు సలహా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మంటల ధాటికి న్యూసౌత్ వేల్స్ లో ముగ్గురు మరణించగా.. నలుగురు గల్లంతయ్యారు. శరవేగంగా వ్యాపిస్తున్న బుష్ ఫైర్స్ కారణంగా ఆకాశమంతా నల్లని పొగలు కమ్మేయగా.. కొన్ని చోట్ల ఎర్రని నారింజ రంగు సంతరించుకోవడం బీభత్సానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రకృతి వైపరీత్యంతో అనేక పట్టణాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పట్టపగలు కూడా గాఢాంధకారం అలముకొంది. అనేకమంది ఇళ్లు, ఆస్తులు అగ్నిజ్వాలలకు ఆహుతవుతున్నాయి. మంటలను ఆర్పేందుకు కొన్ని వారాలు పట్టవచ్చునని, లేదా ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలేనని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ స్వయంగా ప్రకటించడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పలు పట్టణాల్లో ఎమర్జన్సీ సైరన్ లు మోగుతూనే ఉన్నాయి. సుమారు 72 వేల హెక్టార్లు కాలిపోయి బూడిద మిగిలింది. ఈస్ట్ గిప్స్ లాండ్ లో ఓ ప్రైమరీ స్కూలు మంటలకు పూర్తిగా దగ్ధం కాగా.. దగ్గరలోని భవనాలు శిథిలాలుగా మారాయి. నిజానికి గత అక్టోబరు నుంచే మంటలు మొదలయ్యాయని, వీటి ధాటికి ముగ్గురు వాలంటీర్లతో సహా తొమ్మిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా…. ఈ ఉత్పాతం కారణంగా సిడ్నీలో నూతన సంవత్సర సెలబ్రేషన్స్ రద్దు కావచ్ఛునని వార్తలు వస్తుండగా..అలాంటిదేమీ లేదని న్యూ ఇయర్ వేడుకలు యధాప్రకారం జరుగుతాయని కూడా అంటున్నారు.

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం