డేంజర్ రోడ్ యాక్సిడెంట్.. యాసిడ్ పడి!

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇబ్రహీంపట్నం వద్ద ఆగి ఉన్న యాసిడ్‌ లారీని వెనకనుండి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న గ్రూప్‌ వన్‌ ఆడిట్‌ అధికారి అన్నదాత రాగ మంజీరపై యాసిడ్‌ పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. యాసిడ్‌ పూర్తిగా ఒంటిమీద పడటంతో మంజీర మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విశాఖపట్నం పెందుర్తికి చెందిన రాగ మంజీర ఇబ్రహీంపట్నం […]

డేంజర్ రోడ్ యాక్సిడెంట్.. యాసిడ్ పడి!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 31, 2019 | 2:15 PM

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇబ్రహీంపట్నం వద్ద ఆగి ఉన్న యాసిడ్‌ లారీని వెనకనుండి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న గ్రూప్‌ వన్‌ ఆడిట్‌ అధికారి అన్నదాత రాగ మంజీరపై యాసిడ్‌ పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. యాసిడ్‌ పూర్తిగా ఒంటిమీద పడటంతో మంజీర మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విశాఖపట్నం పెందుర్తికి చెందిన రాగ మంజీర ఇబ్రహీంపట్నం డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఆడిట్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఆడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు.