తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపి చెందుతుందా..?

కరోనా​ వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఆ వైరస్ రూపురేఖ‌ల నుంచి..ట్రీట్మెంట్, ​వ్యాక్సిన్​ ఇలా ప్ర‌తి అంశ‌మూ వైద్యులకూ కొత్తే. అందుకే క‌రోనాకు సంబంధించి వివిధ అంశాల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా నిపుణులు ప‌రిశోధ‌న‌లు మొద‌లుపెట్టారు. తాజాగా వైర‌స్ ఎఫెక్ట్ అయిన గ‌ర్భిణిల ద్వారా వారికి పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు కూడా వైర‌స్ వ్యాప్తి చెందుతుందా అనే అంశంపై చైనాలోని పుడాన్ యూనివ‌ర్శిటీ నిపుణులు ప‌రిశోధ‌న‌లు చేశారు. మొత్తం 33 మంది గ‌ర్భినిణిల‌పై ఈ పరిశోధ‌న‌లు చేయ‌గా..వారిలో ముగ్గురికి […]

తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపి చెందుతుందా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 5:52 PM

కరోనా​ వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఆ వైరస్ రూపురేఖ‌ల నుంచి..ట్రీట్మెంట్, ​వ్యాక్సిన్​ ఇలా ప్ర‌తి అంశ‌మూ వైద్యులకూ కొత్తే. అందుకే క‌రోనాకు సంబంధించి వివిధ అంశాల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా నిపుణులు ప‌రిశోధ‌న‌లు మొద‌లుపెట్టారు. తాజాగా వైర‌స్ ఎఫెక్ట్ అయిన గ‌ర్భిణిల ద్వారా వారికి పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు కూడా వైర‌స్ వ్యాప్తి చెందుతుందా అనే అంశంపై చైనాలోని పుడాన్ యూనివ‌ర్శిటీ నిపుణులు ప‌రిశోధ‌న‌లు చేశారు. మొత్తం 33 మంది గ‌ర్భినిణిల‌పై ఈ పరిశోధ‌న‌లు చేయ‌గా..వారిలో ముగ్గురికి పుట్టిన పిల్ల‌ల‌కు మాత్ర‌మే ఈ వైర‌స్ సోకిన‌ట్టు నిర్ధారించారు. ఒకే అనారోగ్య ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతోన్న ఆ శిశువుల‌కు ప్ర‌స్తుతం వైద్య సేవ‌లు అందిస్తున్నారు.

మొదటి శిశువు…

మ‌హిళ‌ గర్భం దాల్చిన 40 వారాల తర్వాత బిడ్డ‌కు జన్మనిచ్చించి. పుట్టిన రెండో రోజున జ్వరం బారిన ప‌డిన‌ట్లు గుర్తించిన అధికారులు.. శిశువును ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ కి పంపించారు. స‌ద‌రు శిశువు నిమోనియాతో బాధపడుతున్నట్లు ప‌రీక్ష‌ల్లో తేలింది. నాలుగు రోజుల పాటు వరుసగా వైరస్​ పరీక్షలు నిర్వహించగా కరోనా పాటిజివ్​గా తేలింది. ఆరో రోజు మాత్రం వైరస్ నెగటివ్​గా రిపోర్ట్ వ‌చ్చింది.

రెండో శిశువు…

మ‌హిళ‌ గర్భం దాల్చిన 40 వారాల తర్వాత ఆప‌రేష‌న్ ద్వారా బిడ్డ‌ను బయటకు తీశారు. పుట్టిన శిశువుకు జ్వరం, వాంతులు, నిమోనియా వంటి సింట‌మ్స్ కనిపించాయి. వైరస్​ పరీక్షలు చేయ‌గా.. రెండు నుంచి 4వ రోజు వరకు కరోనా పాజిటివ్​గా, ఆరో రోజు నెగటివ్​గా రిపోర్ట్ వ‌చ్చింది.

మూడో శిశువు…

మ‌హిళ‌ గర్భం దాల్చిన 31 వారాల రెండు రోజుల తర్వాత ఆప‌రేష‌న్ ద్వారా శిశువును బ‌య‌ట‌కు తీశారు. ఈ చిన్నారికి కూడా నిమెనియా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించారు. , యాంటీ బయాటిక్స్ ఇస్తూ వెంటిలేషన్​ పై ఉంచి​ 14 రోజుల పాటు చికిత్స అందించారు. ముగ్గురు శిశువులు కూడా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ ప‌డిన‌ట్లు వైద్యుల ప‌రిశీల‌న‌లో తేలింది. అయితే తల్లి పాలలో కరోనా వైరస్​ ఆన‌వాళ్లు గుర్తించలేదని స్పష్టం చేశారు.