వెండి మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారంతో పాటు ఇకపై వెండి వస్తువులకు కూడా బీఐఎస్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి కానుంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, నాణ్యత, స్వచ్ఛతను నిర్ధారించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నారు. మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాల డిమాండ్‌తో ఇది అమలు చేయనున్నారు.