AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం చెప్పింది తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇళ్ల పంపిణీకి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ మార్చి నెలాఖరు నాటికి లక్ష కుటుంబాలకు సొంతింటి కలను ప్రభుత్వం నిజం చేయనుంది. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం చెప్పింది తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
Indiramma Indlu Scheme Update
Krishna S
|

Updated on: Mar 14, 2026 | 7:23 PM

Share

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో వేగవంతమైంది. నిరుపేదల సొంతింటి కల సాకారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ఇళ్ల నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి వెల్లడించారు. ఈ మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. నిర్మాణ పనులు నాణ్యతతో, వేగంగా జరిగేలా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

మొదటి విడత లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి భాగ్యం కల్పించడమే తమ లక్ష్యమని, నిధుల కొరత లేకుండా దశలవారీగా అందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులను కేటాయించిందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గత పాలనపై విమర్శలు.. కాంగ్రెస్ చిత్తశుద్ధి

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండు దఫాలు అధికారంలో ఉన్నా, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కేవలం మాటలకే పరిమితమైన గత పాలకుల వల్ల పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని తెలిపారు.

ఖమ్మం జిల్లా అభివృద్ధికి పెద్దపీట

మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడబోమని, ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Follow Us