బీహార్ లో ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ కాల్చివేత, నితీష్ కుమార్ ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు.

బీహార్ రాజధాని పాట్నాలో ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ రూపేష్ కుమార్ ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో..

  • Umakanth Rao
  • Publish Date - 10:35 am, Wed, 13 January 21
బీహార్ లో ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ కాల్చివేత, నితీష్ కుమార్ ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు.

బీహార్ రాజధాని పాట్నాలో ఇండిగో ఎయిర్ పోర్ట్ మేనేజర్ రూపేష్ కుమార్ ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈయన తన ఇంటివద్దే హత్యకు గురయ్యారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి చేరుకున్న రూపేష్ కుమార్ పై అప్పటికే అక్కడ పొంచి ఉన్న వ్యక్తులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. తన కారులోనే తీవ్ర గాయాలకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. తమ సంస్థ ఉద్యోగి దారుణహత్యపట్ల ఇండిగో ఎయిర్ లైన్స్ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. అటు బీహార్ లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విపక్ష ఆర్జేడీ ఆరోపించింది. ప్రభుత్వం నియమించిన గ్యాంగ్ స్టర్లే ఈ హత్యకు పాల్పడ్డారని విపక్ష నేత తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు. రూపేష్ కుమార్ మృతికి ఆయన తీవ్ర సంతాపం ప్రకటించారు. అటు పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

Also Read:

కరోనా వ్యాక్సినేషన్‌కు చురుకుగా ఏర్పాట్లు.. మొదటి విడతలో ప్రజాప్రతినిధులకు అవకాశమివ్వండి.. ప్రధానికి పాండిచ్చేరి సీఎం లేఖ

Sehwag Funny Comment : ఆస్ట్రేలియా వెళ్లేందుకు నేను రెడీ.. సెహ్వాగ్ బాబా మళ్లీ పేల్చాడు..

వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 24మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం..!