Yeddi Cabinet Expansion : కర్నాటక కేబినెట్‌ విస్తరణ.. యడియూరప్ప మంత్రివర్గంలో ఏడుగురు కొత్తవారికి ఛాన్స్..

కర్నాటక కేబినెట్​ను బుధవారం సీఎం యడియూరప్ప విస్తరించనున్నారు. సాయంత్రం వరకు కొత్త మంత్రి మండలి వివరాలు ప్రకటిస్తారు. ఆ వెంటనే...

Yeddi Cabinet Expansion : కర్నాటక కేబినెట్‌ విస్తరణ.. యడియూరప్ప మంత్రివర్గంలో ఏడుగురు కొత్తవారికి ఛాన్స్..
కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత, పార్టీకి ఎంతో నమ్మకస్తుడైన బీఎస్‌ యెడియూరప్ప సీఎం పదవిని నాలుగుసార్లు చేపట్టారు. అయితే ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం ముఖ్యమంత్రి పదవిలో ఆయన కొనసాగలేదు. యడియూరప్ప సీఎం పదవికి నాలుగుసార్లు రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే.. 2007లో.. ఎనిమిది రోజులు సీఎంగా యెడ్డీ.. 2006 జనవరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జేడీ(ఎస్‌) తన మద్దతు ఉపసంహరించింది. ఆ ప్రభుత్వం కూలిపోవడంతో జేడీ(ఎస్‌), బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
Follow us

|

Updated on: Jan 13, 2021 | 11:29 AM

Karnataka Cabinet Expansion : కర్నాటక కేబినెట్​ను బుధవారం సీఎం యడియూరప్ప విస్తరించనున్నారు. సాయంత్రం వరకు కొత్త మంత్రి మండలి వివరాలు ప్రకటిస్తారు. ఆ వెంటనే నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. కేబినెట్​లో కొత్తగా ఏడుగురికి చోటు దక్కుతుందని సూచనప్రాయంగా చెప్పారు. ప్రస్తుత కేబినెట్​లో ఎవరికైనా ఉద్వాసన పలుకుతారా అనే అంశంపై మాత్రం యడియూరప్ప క్లారిటీ ఇవ్వలేదు.

అయితే నూతన కేబినెట్​ మంత్రులపై వస్తున్న వార్తలకు, తాను ప్రకటించబోయే దానికి వాస్తవంగా పొంతన ఉండబోదని యడియూరప్ప తెలిపారు. ప్రస్తుత మంత్రిమండలిలో ఎరికైనా ఉద్వాసన పలుకుతారా? అనే విషయంపై ఆయన ఉత్కంఠ కొనసాగిస్తున్నారు.

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జనరల్​ సెక్రెటరీ ఇంఛార్జ్​ అరుణ్​ సింగ్​లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. కేబినెట్​ కూర్పుపై హోమంత్రి అమిత్​ షా, జేపీ నడ్డాలతో భేటీ యడియూరప్ప అయ్యారు. అనంతరం ఏడుగురికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. బీజేపీ  వర్గాల సమాచారం ప్రకారం ఇద్దరు కేబినెట్​ మంత్రులు చోటు కోల్పోనున్నట్లు తెలుస్తోంది.