వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 24మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం..!

కరీంనగర్- వరంగల్ మధ్య జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 10:03 am, Wed, 13 January 21
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..  24మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం..!

Warangal Road Accident : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్- వరంగల్ మధ్య జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 24మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద వరంగల్-1 డిపోకు చెందిన బస్సు కరీంనగర్‌కు చెందిన మరో బస్సు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొన్నాయిజ ఈ ఘటనలో రెండు బస్సులకు చెందిన ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్‌లకు తీవ్ర గాయాలు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులందరినీ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ‌ఇద్దరు డ్రైవర్ల అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న బాధితులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also.. తెలుగు రాష్ట్రలో భోగి మంటలు.! LIVE : Sankranti Festival Celebrations