Dussehra bullodu Movie: ‘దసరా బుల్లోడి’కి 50 ఏళ్ళు.. ఏయాన్నార్ కెరీర్‏లోనే మొదటి గోల్డెన్ జూబ్లీ సినిమా..

అక్కినేని నాగేశ్వర రావు, వాణి శ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దసరా బుల్లోడు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి రాజేంద్రప్రసాద్

Dussehra bullodu Movie: 'దసరా బుల్లోడి'కి 50 ఏళ్ళు.. ఏయాన్నార్ కెరీర్‏లోనే మొదటి గోల్డెన్ జూబ్లీ సినిమా..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 10:32 AM

అక్కినేని నాగేశ్వర రావు, వాణి శ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దసరా బుల్లోడు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి రాజేంద్రప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కించారు. 1971 జనవరి 13న విడుదలైన ఈ సినిమా ఈరోజుతో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వర రావు కెరీర్‏లోనే తొలి గోల్డెన్ జూబ్లీ సినిమాగా నిలిచింది.

నాగేశ్వర రావు వి.బీ రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, అక్కాచెల్లెలు లాంటి సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం దసరా బుల్లోడు. అప్పటి సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా సూపర్ హిట్ విజయం సాధించింది. ఇక ఏయన్నార్ కెరీర్‏లో గోల్డెన్ జూబ్లీ సినిమాగా దసరా బుల్లోడు నిలిచింది. ఇక ఈ విషయాన్ని అన్నపూర్ణ సినీ స్టూడియోస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక సంచికలో పేర్కోన్నారు. ఇక ఈ సినిమా గ్రామీణ వాతావరణంలో సాగే సంబరాలు, బావ మరదళ్ళు సరదాలు, మావయ్యలను వేళాకోలం చేసే అల్లుళ్ళు, మమకారాలు, ఆధిపత్వాలు, అహంకారులు, అభిమానం అన్నీ ఇందులో కనిపిస్తాయి. పచ్చని పొలాల్లో పాటల చిత్రీకరణ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుంది. ఇక దసరా బుల్లోడు సినిమా 30 థియేటర్లలో విడుదలైంది. 29 థియేటర్లలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. 21 థియేటర్లలో డైరెక్టుగా, కర్నూల్‎లో షిఫ్ట్ మీద శతదినోత్సవం చూసింది. అప్పట్లో థియేటర్లలో ఈ సినిమా బ్లాక్ బస్టర్‏గా నిలిచింది.

Also Read: Pelli Sandadi Movie: పాతికేళ్ళు పూర్తిచేసుకున్న ‘పెళ్ళి సందడి’.. ట్వీట్ చేసిన దర్శకేంద్రుడు..

సంక్రాంతికి ముందుకు వస్తున్న ‘బంగారు బుల్లోడు’.. ప్రేక్షకులను క‌డుపుబ్బ నవ్వించడానికి సిద్ధమవుతున్న..