కరోనా వ్యాక్సినేషన్‌కు చురుకుగా ఏర్పాట్లు.. మొదటి విడతలో ప్రజాప్రతినిధులకు అవకాశమివ్వండి.. ప్రధానికి పాండిచ్చేరి సీఎం లేఖ

ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ అయా రాష్ట్రాలకు చేరిపోయింది. తమకు కూడా ముందు వరుసలో టీకా వేయాలని రాజకీయనేతలు కోరుతున్నారు.

కరోనా వ్యాక్సినేషన్‌కు చురుకుగా ఏర్పాట్లు.. మొదటి విడతలో ప్రజాప్రతినిధులకు అవకాశమివ్వండి.. ప్రధానికి పాండిచ్చేరి సీఎం లేఖ
Follow us

|

Updated on: Jan 13, 2021 | 10:35 AM

Puducherry CM letter to PM Modi : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ముందు ఫ్రంట్ లైన్స్ వారియర్స్‌కు టీకా అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ అయా రాష్ట్రాలకు చేరిపోయింది. అయితే, తమకు కూడా ముందు వరుసలో టీకా వేయాలని రాజకీయనేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి విడతలో రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు, శాసన సభ్యులకు టీకాలు వేసేందుకు అనుమతించాలని కోరుతూ పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి మొదటి విడుత డోసులు దేశంలోని 13 ప్రాంతాలకు చేరాయి. దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కేంద్ర సర్కార్ అనుమతినిచ్చింది. మొదటి దశలో సుమారు మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు టీకాలు వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్లలోపు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి టీకాలు వేయనున్నట్లు చెప్పారు. అనంతరం మిగిలినవారికి టీకా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజా ప్రతినిధులకు కూడా మొదటి విడతలో అవకాశం కల్పించాలని సీఎం నారాయణస్వామి ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??