Indian2 : క్రేన్ యాక్సిడెంట్..చనిపోయిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి కోటి ఆర్థికసాయం..

బుధవారం రాత్రి 'భారతీయుడు-2' చిత్ర షూటింగ్ సమయంలో పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఊహించని క్రేన్ ప్రమాదంలో ముగ్గరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్ర కథానాయకుడు కమల్ హాసన్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.

Indian2 : క్రేన్ యాక్సిడెంట్..చనిపోయిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి కోటి ఆర్థికసాయం..
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 4:54 PM

Indian2 :  బుధవారం రాత్రి ‘భారతీయుడు-2’ చిత్ర షూటింగ్ సమయంలో పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఊహించని క్రేన్ ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్ర కథానాయకుడు కమల్ హాసన్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. తాను ముగ్గరు స్నేహితులను కొల్పోయానని, ఒక్కో కుటుంబానికి కోటి చొప్పున సాయం చేస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కమల్ పేర్కొన్నాడు. మరణించినవారి కుటుంబ సభ్యులను కిల్‌పాక్ హాస్పిటల్‌కి వెళ్లి ఆయన పరామర్శించారు. 

చెన్నైలోని ఈవీపి స్టూడియో సెట్‌లో ఈ బుధవారం రాత్రి  లైటింగ్ ఏర్పాటు చేస్తోన్న సమయంలో..150 అడుగుల ఎత్తులో ఉన్న క్రేన్ తెగి మూవీ యూనిట్ ఉన్న టెంట్‌పై పడింది. ఈ దుర్ఘటనలో ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు(29), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34) స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.  ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందు అక్కడ జరిగిన పరిస్థితులను కమల్ బయటకు వెల్లడించారు. తాను, హీరోయిన్ కాజల్, దర్శకుడు శంకర్, కెమెరామెన్..ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే అక్కడి నుంచి పక్కకు వెళ్లినట్టు తెలిపారు.  ప్రమాదాలు సునామీ వంటివన్న కమల్, వాటికి పేద, ధనిక తేడాలుండవని పేర్కొన్నాడు. కాగా దర్శకుడు శంకర్‌కి కూడా ఈ ప్రమాదంలో గాయాలు అయినట్టు తెలుస్తోంది.