Mahesh in F3:’ఎఫ్ 2′ సీక్వెల్‌లో మహేష్.. డేట్లు ఇచ్చిన సూపర్‌స్టార్..!

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 2. గతేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. 2019సంవత్సరానికి గానూ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీల లిస్ట్‌లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ను

Mahesh in F3:'ఎఫ్ 2' సీక్వెల్‌లో మహేష్.. డేట్లు ఇచ్చిన సూపర్‌స్టార్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 4:51 PM

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 2. గతేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. 2019సంవత్సరానికి గానూ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీల లిస్ట్‌లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ను తీస్తానని అప్పట్లోనే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ఈ సీక్వెల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట అనిల్.

ఇక ఎఫ్ 2లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సీక్వెల్‌లో కంటిన్యూ అవుతుండగా.. మరో స్టార్ హీరో కూడా ఇందులో జాయిన్ అవ్వనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ మధ్యన మాస్‌రాజా రవితేజ పేరు ఎఫ్ 2 సీక్వెల్‌కు వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మరో హీరోగా సూపర్‌స్టార్ మహేష్ బాబు కనిపించనున్నారట. దీనికి సంబంధించిన దర్శకుడికి ఓకే చెప్పడంతో పాటు 13రోజుల కాల్షీట్ కూడా ఇచ్చేశారట.

మహేష్‌తో అనిల్ ‘సరిలేరు నీకెవ్వరు’ను తెరకెక్కించగా.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక ప్రమోషన్ల సమయంలోనూ అనిల్‌తో మరో చిత్రంలో నటిస్తానని మహేష్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎఫ్ 3లో నటించేందుకు సూపర్‌స్టార్ వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకీ, వరుణ్ సరసన హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ కంటిన్యూ అవ్వనుండగా.. మహేష్ సరసన రష్మిక కనిపించబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సీక్వెల్‌ను దిల్ రాజు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also:కథ చెప్పిన దర్శకుడు.. అల్లు అరవింద్‌ను కలవాలన్న మహేష్..!