స్పేస్ లో ఇదో విచిత్రం ! కక్ష్యలో ఏం జరుగుతోంది ?

భారత్ ఆ మధ్యప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి భాగాలు ఇంకా భూ కక్ష్యలో… గాల్లో తేలియాడుతున్నాయట. హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఏస్ట్రోఫిజిక్స్ నిపుణుడు జోనాథన్ మెక్డొవెల్ ఈ సంచలన విషయాన్ని ప్రకటించారు. మొదట దీన్ని ప్రయోగించినప్పుడు దీని భాగాలన్నీ 45 రోజుల్లోగా నాశనమవుతాయని, లేదా కనిపించకుండాపోతాయని డీఆర్డీఏ పేర్కొంది. అయితే ప్రయోగించి 92 రోజులు గడిచినా ఈ ముక్కలు ఇంకా అలాగే కనిపించడం విడ్డూరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్షిపణి భాగాలు చాలావరకు తిరిగి భూమిపై […]

స్పేస్ లో ఇదో విచిత్రం ! కక్ష్యలో ఏం జరుగుతోంది ?
Follow us

|

Updated on: Jun 27, 2019 | 5:48 PM

భారత్ ఆ మధ్యప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి భాగాలు ఇంకా భూ కక్ష్యలో… గాల్లో తేలియాడుతున్నాయట. హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఏస్ట్రోఫిజిక్స్ నిపుణుడు జోనాథన్ మెక్డొవెల్ ఈ సంచలన విషయాన్ని ప్రకటించారు. మొదట దీన్ని ప్రయోగించినప్పుడు దీని భాగాలన్నీ 45 రోజుల్లోగా నాశనమవుతాయని, లేదా కనిపించకుండాపోతాయని డీఆర్డీఏ పేర్కొంది. అయితే ప్రయోగించి 92 రోజులు గడిచినా ఈ ముక్కలు ఇంకా అలాగే కనిపించడం విడ్డూరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్షిపణి భాగాలు చాలావరకు తిరిగి భూమిపై పడిపోయినప్పటికీ.. పలు భాగాలు అలాగే ఉన్నాయని., కానీ ఇవి బహుశా ఏడాదిలోగా అదృశ్యం కావచ్చ్చునని జోనాథన్ మెక్డొవెల్ అంటున్నారు. నిజానికి అంత కాలం పట్టదన్న భారత శాస్త్రజ్ఞుల అంచనాను ఇది తారుమారు చేస్తోంది. యాంటీ శాటిలైట్ టెస్ట్ ద్వారా ఉత్పన్నమైన శిథిల భాగాలన్నీ త్వరలోనే అదృశ్యమవుతాయని డీఆర్ డీఓ చైర్మన్ జి.సతీష్ రెడ్డి గత నెలలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. కాగా-ఈ టెస్టును నాసా ‘ టెరిబుల్ థింగ్ ‘ గా అభివర్ణించింది. ఈ ప్రయోగం వల్ల కక్ష్యలో సుమారు 400 ముక్కలు ఏర్పడ్డాయని, ఇది వ్యోమగాములకు ప్రమాదకరమని నాసా శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగాల వల్ల రోదసి అంతా ఇలాంటి ముక్కలతో నిండిపోతుందని, స్పేస్ పొల్యూషన్ తీవ్రమవుతుందని అమెరికా వంటి దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. నాసా కేంద్రం నుంచి ఎన్ని శాటిలైట్లను ప్రయోగించినా కిమ్మనని ట్రంప్ ప్రభుత్వం ఇండియా వంటి వర్ధమాన దేశాలు అంతరిక్ష ప్రయోగ టెక్నాలజీని మరింత అభివృద్ద్ధి పరచుకుంటే మాత్రం అసూయ పడుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు