అమెరికాలో దారుణం: భారత యువతిపై అత్యాచారం, హత్య

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన యువతిపై..ఉన్మాది అత్యాచారం చేసి అంతమొందించాడు. మృతురాలిని 19 ఏళ్ల  రూత్ జార్జ్‌గా గుర్తించారు. ఆమె యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో హైయ్యర్ స్టడీస్ చదువుతోంది. న‌వంబ‌ర్ 23వ తేదీన ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది.  రూత్ మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ గ్యారేజీలో గుర్తించారు. జార్జ్‌‌ను గొంతు కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు.  సీసీ టీవీ విజువల్స్ పరిశీలించిన అనంతరం ఈ మర్డర్ కేసులో 26 ఏళ్ల డోనాల్డ్ తుర్‌మాన్‌ను దోషిగా తేల్చారు. […]

అమెరికాలో దారుణం: భారత యువతిపై అత్యాచారం, హత్య
Ram Naramaneni

|

Nov 26, 2019 | 12:16 PM

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన యువతిపై..ఉన్మాది అత్యాచారం చేసి అంతమొందించాడు. మృతురాలిని 19 ఏళ్ల  రూత్ జార్జ్‌గా గుర్తించారు. ఆమె యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో హైయ్యర్ స్టడీస్ చదువుతోంది. న‌వంబ‌ర్ 23వ తేదీన ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది.  రూత్ మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ గ్యారేజీలో గుర్తించారు. జార్జ్‌‌ను గొంతు కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు. 

సీసీ టీవీ విజువల్స్ పరిశీలించిన అనంతరం ఈ మర్డర్ కేసులో 26 ఏళ్ల డోనాల్డ్ తుర్‌మాన్‌ను దోషిగా తేల్చారు. అతడిపై ఫస్ట్ డిగ్రీతో పాటు పలు కేసులను నమోదు చేశారు. క్యాంపస్ సమీపంలో నిందితుడు నివసిస్తున్నట్టు సమాచారం. ఆయుధాల దోపిడి కేసులో అతనికి గతంలో 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. రెండు సంవత్సరాలు శిక్ష అనుభవించిన అనంతరం 2018 డిసెంబర్‌లో పెరోల్‌‌పై  విడుదలయ్యాడు. నిందితుడికి యూనివర్సిటీతో కానీ జార్జ్‌తో కానీ ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం జార్జ్‌ది హైదరాబాద్‌గా తెలుస్తోంది. 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu