శ్వేతసౌధంలో వీర శునకం

అమెరికన్‌ హీరో. ఐసిస్‌ అధినేత అల్‌ బగ్దాదీని వెంటాడి వేటాడిన వీర శునకం. ఇప్పుడా జాగిలానికి అరుదైన గౌరవం లభించింది. అధ్యక్షుడు నివాసముండే శ్వేతసౌధాన్ని సందర్శించే అవకాశం దక్కింది. స్వయంగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌..కోనన్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. కోనన్‌ చాలా చురుకైనది, తెలివైనది అంటూ అమెరికన్‌ హీరోగా అభివర్ణించారు. సైన్యంతో కలిసి గొప్ప సేవలందించిందని..కోనన్‌కు మెడల్‌ ఆఫ్‌ హానర్‌ను కూడా ప్రకటించారు. ఐసిస్‌ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ..సిరియాలోని ఓ టన్నెల్‌లో తలదాచుకున్నాడన్న సమాచారంతో అమెరికన్‌ […]

శ్వేతసౌధంలో వీర శునకం
Follow us
Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 26, 2019 | 2:33 PM

అమెరికన్‌ హీరో. ఐసిస్‌ అధినేత అల్‌ బగ్దాదీని వెంటాడి వేటాడిన వీర శునకం. ఇప్పుడా జాగిలానికి అరుదైన గౌరవం లభించింది. అధ్యక్షుడు నివాసముండే శ్వేతసౌధాన్ని సందర్శించే అవకాశం దక్కింది. స్వయంగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌..కోనన్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. కోనన్‌ చాలా చురుకైనది, తెలివైనది అంటూ అమెరికన్‌ హీరోగా అభివర్ణించారు. సైన్యంతో కలిసి గొప్ప సేవలందించిందని..కోనన్‌కు మెడల్‌ ఆఫ్‌ హానర్‌ను కూడా ప్రకటించారు.

ఐసిస్‌ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ..సిరియాలోని ఓ టన్నెల్‌లో తలదాచుకున్నాడన్న సమాచారంతో అమెరికన్‌ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అక్టోబర్‌ 26న జరిగిన ఈ ఆపరేషన్‌లో తప్పించుకునేందుకు ప్రయత్నించిన కరుడుగట్టిన ఉగ్రవాది బగ్ధాదీని పట్టుకునేందుకు..మిలటరీ జాగిలాలను పంపింది అమెరికా సైన్యం. ఇందులో బెల్జియం మాలినోయిస్‌ జాతికి చెందిన కోనన్‌..ఆ నరహంతకుణ్ణి తరిమి తరిమి కొట్టింది. ఇక గత్యంతరం లేక తనను తాను కాల్చుకొని కుక్కచావు చచ్చాడు బగ్ధాదీ. ఐతే ఆ ఘటనలో కోనన్‌కు గాయాలైనా వెనకాడకుండా తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు కోలుకొని మళ్లీ విధుల్లో చేరిపోయింది ఆ వీర శునకం.

ప్రస్తుతం ఆ జాగిలాన్ని అధ్యక్షుడి ఆహ్వానం మేరకు వైట్‌హౌస్‌కు తీసుకొచ్చారు‌ అధికారులు. ఈ సందర్భంగా కోనన్‌ సేవలను కొనియాడిన ట్రంప్‌..మరికొంతకాలం పాటు అమెరికన్‌ సైన్యానికి తన సేవలందిస్తుందని తెలిపారు. ఇక స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కెనైన్ ప్రోగ్రాంలో.. కోనన్ నాలుగేళ్ల పాటు శిక్షణ పొందినట్లు వెల్లడించారు అమెరికా సెంట్రల్ కమాండర్ జనరల్ కెన్నెత్ మెకెంజీ. శిక్షణ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 50 స్పెషల్‌ ఆపరేషన్స్‌లో పాల్గొన్నట్లు ప్రకటించారు.